Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!
Jewelry | యంత్రాలతో చేసిన నగలకూ, చేతితో ప్రాణంపోసిన ఆభరణాలకూ.. ప్లాస్టిక్ పూలకు, అచ్చమైన గులాబీలకు ఉన్నంత తేడా! చేనేత చీరలు శ్వాసించినట్టే.. చేతితో చేసిన నగలు స్పందిస్తాయి. అంతేనా, అలంకరించుకున్న వారికి ఆహ్లాదాన్ని ఇస్తాయి. కాబట్టే, హ్యాండ్ మేడ్ వెండి జువెలరీ ( handmade silver jewelry )ని అంతగా ఇష్టపడుతున్నారు ఆధునిక యువతులు.

వెండిది సహజమైన మెరుపు. వెన్నెలకు దీటైన వన్నె. చేయి తిరిగిన స్వర్ణకారుడి చేతిలో పడితే వెన్నముద్దలా కరిగిపోతుంది. కోరిన రూపాన్ని ధరిస్తుంది. కాంతకు కొత్త కాంతు
లిస్తుంది. కాబట్టే, హ్యాండ్ మేడ్ వెండి జువెలరీ.. ఆభరణాల మార్కెట్‌ను శాసిస్తున్నది. అందులోనూ, హ్యాండ్ మేడ్ జువెలరీలో.. అజ్ఞాత స్వర్ణకారుడి సృజన ఉంటుంది, వారసత్వంగా తనకు అబ్బిన కళ ఉంటుంది. మెషీన్ నగలతో పోలిస్తే మెరుపులో, ఫినిషింగ్‌లో తిరుగే ఉండదు. వీటికి బిద్రీ వర్క్, మీనాకారీ, చారిత్రక డిజైన్లు కలబోసి కొత్త కళ తీసుకొస్తారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు, సీరియళ్ల పుణ్యమాని ఈ నగలకు విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. ఆయా పాత్రలలోని మహారాణులను తలపించేలా.. నఖశిఖం వెండి నగలు ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు ఆధునిక గృహిణులు. శరీరాకృతికి, వన్నెకు నప్పేలా డిజైన్లను ఎంచుకుంటున్నారు.

అచ్చం బంగారమే
నుదుట పాపిటబిళ్ల నుంచి కాలిపట్టీల వరకు భారీభారీ నగలను ధరించడం లేటెస్ట్ ఫ్యాషన్. కాబట్టే, పాతకాలపు నగలు కొత్తతరం జువెలరీ బాక్స్‌లలో చోటు సంపాదిస్తున్నాయి. వెడ్డింగ్ జువెలరీ, టెంపుల్ జువెలరీ.. బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చేరాయి. కానీ, క్షణక్షణముల్.. ఫ్యాషన్లు! పాతబడిపోతే లాకర్‌కే పరి మితం అవుతాయి. అందుకే, చాలామంది వెండి నగలపై మొగ్గు చూపుతున్నారు. బంగారు వన్నె కోసం.. వాటిపైనే బంగారు మెరుపులు అద్దుతున్నారు. దీనివల్ల స్వర్ణకాంతులతో ధగధగలాడే వెండినగలు ధరించవచ్చు. సిల్వర్ జువెలరీలోనూ రకరకాల సెట్లు, కాంబోలు ఉన్నాయి. సంప్రదాయ దుస్తులమీదనే కాకుండా వెస్ట్రన్ వేర్పైనా ధరించేలా తేలికపాటి నగలూ వచ్చేశాయి. సిల్క్, ఫ్యాబ్రిక్ సొబగులద్దిన వెండి నగలు కూడా మగువలను ఆకట్టుకుంటున్నాయి.

Read More :
“Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”
Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి”
“ఒకప్పుడు పాప్ ప్రియులను ఊపు ఊపిన ఫ్యాషన్ ట్రెండ్ మళ్లీ వచ్చేసింది!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

