Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి
Half and Half Jewelery | స్వర్ణానికి ముత్యాలకు దోస్తీ పచ్చలకు కెంపులకు దోస్తీ పగడాలకు వజ్రాలకు దోస్తీ ఈ దోస్తీ కాన్సెప్ట్ సినిమాల్లోనే కాదు, ఆభరణాల్లోనూ సూపర్‌హిట్‌గా నిలుస్తున్నది. విభిన్న డిజైన్లకు దోస్తీ కుదిర్చిన నగలు అతివలకు వల విసురుతున్నాయి. ‘హాఫ్ అండ్ హాఫ్’ పేరుతో ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. అంటే ఒకే జువెలరీతో రెండు సంతోషాలు సొంతం చేసుకోవచ్చన్నమాట!
పెండ్లి, పేరంటాలకు వేసుకునే బంగారు నగల్లోనూ ఈ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ జువెలరీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని ఎంచుకోవడం వల్ల రెండురకాల లాభాలుంటాయి. నచ్చిన రెండు డిజైన్లను కలిపి ఒకే నగ చేయించుకోవచ్చు. అలాగే తక్కువ బంగారంతో నగలు కావాలనుకునేవాళ్లకు ఈ హాఫ్ అండ్ హాఫ్ నగలు మంచి ఎంపిక. సగం నగను భారీగా డిజైన్ చేయించుకున్నా, రెండో సగాన్ని సాదాసీదా గొలుసుగా చేయించుకోవచ్చు. వెరైటీగానూ ఉంటుంది, పైగా బడ్జెట్లో తయారవుతుంది.
వెండి-ప్లాటినమ్ జోష్..
సాదాసీదా పూసలతో జతకట్టిన ప్లాటినం, వెండి నగలు మగువల మనసులను దోచేస్తున్నాయి. సంప్రదాయ వస్త్రధారణకు, వెస్ట్రన్ వేర్‌కు ఇవి బాగా నప్పుతున్నాయి. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలూ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్‌తో చేసిన సన్నని, తేలికపాటి గొలుసులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త కాంబినేషన్స్..
హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లల్లో ముత్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నగలో సగం ముత్యాలు, మరోసగం బంగారంతో నచ్చిన డిజైన్ చేయించుకుంటున్నారు. బంగారానికి జోడీగా ముత్యాలతోపాటు పగడాలు, కెంపులు, కుందన్లు, పచ్చలను ఎంచుకొని హారాలుగా మలుచుకుంటున్నారు. ఒక సగం ముత్యాలు, మరో సగం బంగారం గుండ్లతో తీర్చిదిద్దిన నగలు ఇప్పుడు ట్రెండ్‌గా చెబుతున్నారు. కాలేజీ పిల్లల నుంచి ఉద్యోగుల వరకు అందరూ వీటిని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రోజువారీ నగల్లా వీటిని ధరిస్తున్నారు.


Read More :
Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
jaipur jewellery | ఆధునిక యువతులను ఆకర్షిస్తున్న రాజపుత్ర రాచకన్యల నగల గురించి తెలుసా”
“Jewellery Cleaning Tips | బంగారు నగలు నల్లబడ్డాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయి..”
Polki Jewellery | వజ్రపు మెరుపులతో అందాన్ని రెట్టింపు చేసే ఈ నగల గురించి తెలుసా?”
“Evil eye jewelry | దిష్టి తగలకుండా ఈ ఆభరణాలు ఎప్పుడైనా ధరించారా?”
“antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

