Polki Jewellery | వజ్రపు మెరుపులతో అందాన్ని రెట్టింపు చేసే ఈ నగల గురించి తెలుసా?
Polki Jewellery | అతివల అలంకరణలో ఆభరణాలదే అగ్రస్థానం. ఏ వేడుకలో అయినా ట్రెండ్‌కు తగిన నగలతో మెరిసిపోతుంటారు. బ్రైడల్, ట్రెడిషనల్ జువెలరీలో ప్రత్యేకంగా నిలుస్తూ మగువల మనసు దోచేస్తున్నది.. పోల్కి జువెలరీ. అచ్చమైన వజ్రపు మెరుపులతో కలికి అందాన్నిరెట్టింపు చేసే పోల్కి నగధగలేమిటో చూద్దాం..

స్వచ్ఛమైన వజ్రాలను గుదిగుచ్చి రూపొందించేవే పోల్కి నగలు. ఎటువంటి కత్తిరింపులు లేకుండా వజ్రాలను యథాతథంగా పొదుగుతూ ఈ నగలను డిజైన్ చేస్తారు. భారతదేశమే పోల్కి నగల పుట్టిల్లని ఓ వాదన. మొఘలుల రాకతో వీటికి ఆదరణ పెరిగింది. పోల్కి నగల తయారీలో రాజస్థాన్, గుజరాత్ ప్రత్యేక గుర్తింపును పొందాయి.

సానపట్టని వజ్రం..
పోల్కి నగలు కుందన్ జువెలరీని పోలి ఉన్నా తయారీలో చాలా తేడా ఉంటుంది. గ్లాస్స్టోన్స్తో చేసేవి కుందన్ ఆభరణాలైతే, అచ్చమైన వజ్రాలను పొదిగి ప్రాణం పోసేవి పోల్కి నగలు. నేల పొరల్లో దొరికిన వజ్రాలను పాలిష్ చేయకుండా, కత్తిరించకుండా.. బాగా శుభ్రపరిచి ఈ నగల్లో పొదుగుతారు. అందువల్లే పోల్కి ఆభరణాల్లో వజ్రాలు రకరకాల ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో ఉంటాయి. వజ్రాల సొబగుల కారణంగా వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పోల్కి నగల్లోనూ ముత్యాలు, రత్నాలను మేళవించిన కంఠాభరణాలు, చోకర్లు, హారాలు, గాజులు, బ్రేస్లెట్లు.. ఇలా పాపిట నుంచి పాదాల వరకు అన్ని ఆభరణాలూ అందుబాటులో ఉన్నాయి. మొఘలులు ధరించిన మాంగ్ టిక్కాలు, పెద్దపెద్ద చోకర్లు బాగా ప్రాచుర్యం పొందాయి.

జుడావ్ పద్ధతిలో..
ఈ నగలను ‘జుడావ్’ అనే ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ద్రవరూపంలోని బంగారానికి వజ్రాలను అద్ది అందమైన నగలను రూపొందించడమే జుడావ్ పద్ధతి. ఈ ప్రక్రియలో పొదిగిన వజ్రాలు, రత్నాల చుట్టూ బంగారం అలుముకుంటుంది. కాబట్టే, ఎక్కడా కొక్కేలు కనపడవు. వెనకవైపు మీనాకారి పద్ధతిని అనుసరించి అందమైన పోల్కి నగలను రూపొందిస్తారు.

దుస్తులకు నప్పేలా..
కత్తిరించని వజ్రాలకు మెరుపు అపారం. కాబట్టే భారీ చోకర్లు, జుడావ్ పోల్కీలు, నెక్లెస్ సెట్లు కత్తిరించని వజ్రాలతోనే తయారవుతాయి. వీటికి ముత్యాలు, రత్నాలనూ జోడించి ధరిస్తే వజ్రాల మెరుపు మరింత స్పష్టంగా పరావర్తనం చెందుతుంది. ఆ కాంతిలో పెండ్లికూతురికి కొత్త కళ వచ్చేస్తుంది. నవ వరుడు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.

నయా ట్రెండ్..
మెడ చుట్టూ దొంతర్లు దొంతర్లుగా ఉండే లేయర్డ్ నెక్ పీస్‌లు లేటెస్ట్ ట్రెండ్. ఇవి నిండుదనంతోపాటు రిచ్ లుక్‌నూ ఇస్తాయి. పండగలు, వేడుకలు, పూజల్లో ఈ తరహా నగల అలంకరణ ఆకర్షణీయంగా ఉంటుంది. పోల్కి చోకర్ నెక్లెస్ ఈ మధ్యకాలంలో ట్రెండీగా మారింది. చోకర్లోనూ విభిన్నరకాలు ఉన్నాయి. ఇదివరకు బంగారం, వజ్రాలతో చేసిన చోకర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మెరిసే రాళ్లు, ముత్యాలతో ట్రెండీ చోకర్లు కూడా వచ్చాయి. ‘జోదా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చారిత్రక సినిమాల్లోనే కాదు.. వెండితెర వేడుకల్లోనూ సెలబ్రిటీలు వీటిని ధరించడం వల్ల ఆదరణ మరింత పెరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్
snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

