jaipur jewellery | ఆధునిక యువతులను ఆకర్షిస్తున్న రాజపుత్ర రాచకన్యల నగల గురించి తెలుసా
jaipur jewellery | రాజపుత్ర రాచకన్యల నఖశిఖం నగలే. పాపిటబిళ్ల మొదలు కాలిమెట్టెల వరకు ప్రతి ఆభరణంలో భారీతనమే. తరాలనాటి ఆ డిజైన్లు ఆధునిక యువతులనూ ఆకర్షిస్తున్నాయి. మీనాకారీ, పోల్కీ, చాంద్‌బాలీ, కుందన్, జుడావ్ ఆభరణాలకు మూలమైన జైపూర్ నగల మెరుపులేమిటో ఓసారి చూద్దాం..

పాపిట బిళ్ల ప్రత్యేకంగా..
కేశాలంకార ప్రియులు ధరించే పాపిట బిళ్లలను జైపూర్ సంప్రదాయంలో ‘మాంగ్టిక్కా’ అని పిలుస్తారు. వీటిలో భారీతనం ఉట్టిపడుతుంది. పెద్దపెద్ద రాళ్లు, ముత్యాలను మేళవించి తయారుచేస్తారు. వివాహితలు కచ్చితంగా పాపిట బిళ్లను ధరించడం ఇక్కడి రివాజు. బుట్టాలు, చంద్రవంకల వంటి ప్రత్యేక డిజైన్లలోనూ తయారుచేస్తారు. రోజు వారీగా ధరించేందుకు చిన్నవి సరిపోతాయి. శుభకార్యాల్లో ముస్తాబు చేసుకునేందుకు పెద్దపెద్ద మాంగ్ టిక్కాలూ సిద్ధంగా ఉన్నాయి.

ముచ్చటైన ముక్కెర..
అసలే రాజపుత్ర కాంతలవి సంపెంగ నాసికాలు. ఆ సొగసును ఇనుమడించడంలో అక్కరకొచ్చే నగ.. ముక్కెర. ముక్కుపుడక అంటే తెలుగువారికే కాదు, రాజపుత్రులకూ వల్లమాలిన ప్రేమ. ముక్కెర బరువు మొత్తం ముక్కుమీద పడకుండా సన్నని గొలుసుతో జుట్టుకు తగిలించేందుకు వీలుగా ఓ కొక్కెం కూడా ఉంటుంది. రత్నాలు పొదిగిన గాజులు, హారాలు, చోకర్లు, బ్రేస్‌లెట్లకు సైతం హంగూ ఆర్భాటాలు ఎక్కువే.

కంటె.. కాస్త భిన్నంగా
మెడచుట్టూ అలంకరించుకునే కడియం లాంటి ఆభరణమే.. కంటె. ఇది తరాలనాటి నగ. ఉత్తర, దక్షిణ భారతాల్లోనూ కంటె సంప్రదాయం ఉంది. జైపూర్ పరిసర ప్రాంతాల్లో అలంకరించుకునే కంటెలు కొంత భిన్నంగా ఉంటాయి. వీటిలో జుడావ్ పద్ధతిలో రంగురాళ్లు, రత్నాలు, ముత్యాలు పొదుగుతారు. మీనాకారి సొబగులద్దిన డిజైన్లూ అందుబాటులో ఉన్నాయి. మామూలు కంటెల కంటే వీటి పరిమాణం ఎక్కువే.

వెండి సొగసులు..
జైపూర్ జువెలరీలో వెండిది కొండంత స్థానం. పెద్దపెద్ద వెండి పెండెంట్లకు రంగురంగుల ఫ్యాబ్రిక్‌ను జతచేసిన నగలు సంప్రదాయ దుస్తులతోపాటు ఫ్యాషన్ వస్ర్తాలకూ చక్కగా నప్పుతాయి. రాజపుత్రుల నగల్లో నెమలి కంఠం రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఉంగరాలు, గాజుల డిజైనింగ్‌లోనూ హుందాతనం తొంగిచూస్తుంది. ప్రత్యేక వేడుకల్లో నిండుగా కనిపించాలంటే జైపూర్ ఆభరణాలకు జై కొట్టాల్సిందే.
Read More :
Banana jewellery | బంగారు నగలు కాదు.. అరటితో చేసిన ఆభరణాల గురించి తెలుసా”
“Jewellery Cleaning Tips | బంగారు నగలు నల్లబడ్డాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయి..”
“Polki Jewellery | వజ్రపు మెరుపులతో అందాన్ని రెట్టింపు చేసే ఈ నగల గురించి తెలుసా?”
Evil eye jewelry | దిష్టి తగలకుండా ఈ ఆభరణాలు ఎప్పుడైనా ధరించారా?”
zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video







