Floral Jewellery | ప్రకృతికి అందం పూలు. మగువకు అలంకారం పూలు. ఒంటినిండా ఎన్ని ఆభరణాలున్నా.. పూల ప్రత్యేకతే వేరు. గుప్పెడు మల్లెలు, మూరెడు చామంతులు, ఓ లేత గులాబీ, దోసెడు కనకాంబరాలు.. కాంతామణికి కనకాన్ని మించిన కాంతినిస్తాయి.
పూలను ఆభరణాలుగా ధరించడం కొత్త సంప్రదాయమేం కాదు. పురాణ ఇతిహాసాల్లోనూ పూల నగల ప్రస్తావన ఉంది. అంతఃపురంలోని పూదోటలు రాణీవారి అలంకారాలకే అంకితం. నేటి డిజైనర్లు కూడా రంగురంగుల పూలకు పచ్చని ఆకులు, మొగ్గలను మేళవించి ముచ్చటైన నగలను రూపొందిస్తున్నారు.
ఎంత అందమైన పూలైనా ఒక్కపూట గడిస్తే వాడిపోవాల్సిందే. ఇక ఒంటిమీద ధరిస్తే ఇట్టే నలిగిపోయి వడలిపోవాల్సిందే. కానీ పూలతో చేసిన ఆభరణాలు త్వరగా వాడిపోకుండా వాటిపై రకరకాల రసాయనాలు చల్లుతారు. దీంతో గంటలకొద్దీ తాజాగా ఉంటాయి, వింత పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. పూల నగలను రూపొందించేందుకు ప్రత్యేకంగా కొన్ని పూలనే ఎంచుకుంటారు. హైబ్రీడ్ రకానికి చెందిన ఈ పూలు మిగతావాటితో పోలిస్తే కాస్త దృఢంగానే ఉంటాయి. ఎక్కువసేపు నిగనిగలాడుతాయి. ప్లాస్టిక్ పూలతోనూ ఆభరణాలు వస్తున్నాయి. నిజమైన పూలతో పోలిస్తే వీటి బరువు తక్కువ. చవక కూడా. మరింత అందాన్ని చేకూర్చేలా ముత్యాలు, పూసలు పొదుగుతారు. అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా, కాజల్ వంటి సెలెబ్రిటీలు కూడా పూల నగలను ధరించడంతో ఇదో ఫ్యాషన్‌గా మారిపోయింది.
Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
“మినిమలిజం.. ప్రపంచవ్యాప్తంగా ఇదొక ట్రెండ్.. ఫ్యాషన్‌లో ఇది ఎలా వర్కవుట్ అవుతుందంటే..”
Cleopatra Choker | ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర వాడిన ఈ నగల నమూనా ఇప్పటికే ట్రెండింగ్నే!!”
Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”