మినిమలిజం.. ప్రపంచవ్యాప్తంగా ఇదొక ట్రెండ్.. ఫ్యాషన్‌లో ఇది ఎలా వర్కవుట్ అవుతుందంటే..
Minimalism | మినిమలిజం.. ప్రపంచ వ్యాప్తంగా ఓ ట్రెండ్! తక్కువ వనరులతో, తక్కువ వసతులతో ఆనందంగా బతికేయడమే ‘మినిమలిజం’ ప్రధాన లక్షణం. ఈ సూత్రం నగలకూ అన్వయించుకుంటున్నారు. భారీ ఆభరణాల జోలికి వెళ్లకుండా.. సన్నాసన్నని డిజైన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు.. వాటికే బోలెడు అందాలను జొప్పిస్తున్నారు డిజైనర్లు.

పూలు, ఆకులు, తీగలతోపాటు సీతాకోక చిలుకలు, మయూరాలు ‘మినిమల్’ నగల్లో ముచ్చటగా ఒదిగిపోయాయి. తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలు, వివిధ ఆకృతులతో కూడిన పెండెంట్లు వీటికి మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. ఈ పద్ధతిలో సన్నని బంగారు తీగలను అందమైన డిజైన్లుగా మలుస్తారు. వీటికే రాళ్లు, ముత్యాలు, జాతి రత్నాలను జోడిస్తారు. ఆధునిక దుస్తులకు ఇవి సరిజోడు. చుడీదార్లు, టాప్స్, జీన్స్ మీదికి కూడా చక్కగా నప్పుతాయి. తేలికగా ఉంటూనే ైస్టెలిష్ లుక్‌తో మెరుపులు మెరిపిస్తాయి. కాబట్టే, ఈతరం అమ్మాయిలు వీటిని ఇష్ట పడుతున్నారు. సన్నగా ఉంటాయి కాబట్టి, బంగారం ఖర్చు తక్కువే. వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జువెలరీలోనూ ఈ డిజైన్లు దొరుకుతున్నాయి.

పాపిట బిళ్లల నుంచి గొలుసులు, కమ్మలు, ఉంగరాలు, వడ్డాణాలు, వంకీలు, గాజులు, బ్రేస్లెట్లు, కాలి మువ్వలు, మెట్టెలు.. ఇలా ప్రతి నగా నాజూకుగా మారుతున్నది. చూసేందుకు సన్నగా కనిపించినా దృఢంగానే ఉంటాయి. తెగిపోవడం, వంకర తిరగడం, విరిగిపోవడం.. తదితర సమస్యలు ఉండవు. భారీ నగలు ఒంటికి గుచ్చుకుంటూ.. కొంతమేర
అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ జువెలరీతో సమస్య ఉండదు. కొనడం తేలిక. ధరించడం తేలిక. నలుగురి చూపూ తమ వైపు తిప్పుకోవడమూ తేలికే.

Read More :
“సన్నని నడుముకు వన్నెల గొలుసు.. మళ్లీ ట్రెండింగ్ అవుతున్న ఓల్డ్ స్టైల్”
మారిన ఫ్యాషన్.. కొత్త రంగులు, వింత షేడ్స్‌లో నెయిల్ పాలిష్”
“Cleopatra Choker | ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర వాడిన ఈ నగల నమూనా ఇప్పటికే ట్రెండింగ్నే!!”
“3D Jewelry | ఆకట్టుకుంటున్న త్రీడీ నగలు.. ఇక పాత డిజైన్లు మరిచిపోవాల్సిందే..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

