3D Jewelry | ఆకట్టుకుంటున్న త్రీడీ నగలు.. ఇక పాత డిజైన్లు మరిచిపోవాల్సిందే..
3D Jewelry | త్రీడీ బొమ్మ బాల్యంలో ఓ మరపురాని గుర్తు. త్రీడీ సినిమా అందమైన అనుభవం. బొమ్మ అయినా, సినిమా అయినా త్రీడీలో కంటపడితే ముచ్చటైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఇదే త్రీడీ హంగులు ఆభరణాల్లోనూ మెరుస్తున్నాయి. పడికట్టు డిజైన్లకు చరమగీతంపాడుతూ కనికట్టు చేస్తున్న త్రీడీ నగలకు నారీమణులు ఫిదా అవుతున్నారు. ఈ నయా నగల ధగధగలేంటో తెలుసుకుందాం..

అందం ఇనుమడించాలంటే ఆభరణాలు తోడవ్వాల్సిందే. అందుకే అతివలు శరీరానికి నప్పే, మేని ఛాయకు ఒప్పే రకరకాల నగలను ఎంచుకుంటారు. ఆ జాబితాలో త్రీడీ ఆభరణాలూ వచ్చి చేరాయి. ఈ నగలను కోరుకున్నట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఏ రూపాన్నయినా పొందికగా పొదగవచ్చు.

ఎలా చేస్తారు ?
సాధారణంగా ఆభరణాల తయారీ కోసం బంగారం, వెండి, ప్లాటినం తదితర లోహాలను కరిగించి అచ్చుల్లో పోసి మలుస్తారు. కొన్ని నగలను తీగలు అల్లుతూ, పూసలు చేరుస్తూ, రత్నాలు పొదుగుతూ తీర్చిదిద్దుతారు. ఈ త్రీడీ నగలను మాత్రం కంప్యూటర్ సాయంతో రూపొందిస్తారు. ముందుగా కావాల్సిన డిజైన్‌ను కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి, త్రీడీ ప్రింటర్‌తో డూప్లికేట్ నగ సిద్ధం చేస్తారు. దాని సాయంతో అచ్చు తయారుచేస్తారు. ఆ అచ్చులో బంగారం, ప్లాటినం, వెండి తదితర లోహాల ద్రవాన్ని పోసి ఆభరణానికి రూపం ఇస్తారు. చివరగా మెరుగుపెట్టి మెరుపులు జోడిస్తారు.

అన్ని డిజైన్లలోనూ..
ఉంగరాలు, బ్రేస్లెట్లు, హారాలు, చోకర్లు, గాజులు.. ఇలా ఒకటేమిటి మగువల మనసుకు నచ్చే అన్ని రకాల త్రీడీ నగలూ మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ఆభరణాల్లో పూలు, ఆకులు, తీగలు, జంతువులతో కూడిన డిజైన్లు ఎక్కువ. లాకెట్లు, పెండెంట్లు విభిన్న రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇష్టమైన వ్యక్తుల పేర్లు, రూపాలను కూడా ఆభరణంగా మలుచుకునే వెసులుబాటు ఉంది. మిగతా వాటితో పోలిస్తే త్రీడీ నగల ధర తక్కువే. ఎందుకంటే, మామూలు ఆభరణాల కన్నా వీటిలో లోహ పరిమాణం తక్కువ! సన్నని తీగల్లాంటి నగలే అయినా చూడటానికి భారీగా కనిపించడం వీటి ప్రత్యేకత.

Read More :
Between the Finger Rings | రెండు వేళ్లకు ఒక్కటే ఉంగరం.. ఆకట్టుకుంటున్న నయా ట్రెండ్”
Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి”
Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Statement Jewelry | మగువల మనసు తెలిపే ప్రత్యేక నగలు ఇవి.. వీటి ప్రత్యేకతలు ఏంటంటే..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

