Statement Jewelry | మగువల మనసు తెలిపే ప్రత్యేక నగలు ఇవి.. వీటి ప్రత్యేకతలు ఏంటంటే..
Statement Jewelry | అతివలకు ఆభరణాలంటే ఇష్టం. ధరించే నగలను బట్టి వారి ఆలోచనలు, అభిరుచులు అంచనా వేయవచ్చు. అందులోనూ మహిళల హృదయావిష్కరణ.. స్టేట్మెంట్ జువెలరీ. వాటిలో వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. మగువలమనసు తెలిపే సరికొత్త నగల ధగధగలేంటో చూద్దాం..
ఆభరణాలు ధరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం. కొందరు అందంగా కనిపించేందుకు, మరికొందరు దర్పం కోసం అలంకరించుకుంటారు. ఇంకొందరు హుందాగా అనిపించే నగలు ఎంచుకుంటే.. మరికొందరు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సొమ్ములను ఇష్టపడతారు. అలంకరణ ద్వారా విశ్వాసాలు, నమ్మకాలను తెలియజేసేందుకు స్టేట్మెంట్ జువెలరీ ఓ తిరుగులేని మార్గం కూడా.

♦ ఇష్టాన్ని ప్రతిబింబిస్తూ
ప్రకృతిని ప్రేమించని వారు ఎవరు? కొందరైతే ఎప్పుడూ తమచుట్టూ మొక్కలు, పూలు ఉండేలా చూసుకుంటారు. ఆ ఇష్టాన్ని ఇప్పుడు నగల్లోనూ చూపించవచ్చు. పూలు, ఆకులు, తీగలతో చాలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతిపై ప్రేమను తెలియజేసేలా స్టేట్మెంట్ ఆభరణాలను అలంకరించుకుని మురిసిపోవచ్చు. జంతుప్రేమికుల కోసం వన్యమృగాల ఆకృతులతో తీర్చిదిద్దిన వెరైటీలూ ఉన్నాయి. ఒక్కో జంతువును ఒక్కో గుణానికి చిహ్నంగా భావిస్తారు. వేగాన్ని ఇష్టపడేవాళ్లు గుర్రం, అందాన్ని ఆరాధించేవాళ్లు మయూరం, విశ్వాసాన్ని కోరుకునేవారు శునకం.. ఇలా వారివారి ఇష్టాన్ని బట్టి పలు జంతువులను ఎంచుకుంటారు. సముద్రం, రాళ్లు, నత్తలు, అలలు.. వంటివాటి పట్ల మక్కువచూపే వారి కోసం ప్రత్యేకమైన థీమ్స్‌తో రూపొందించిన నగలూ అనేకం.

♦ భారీతనం ఉట్టిపడేలా..
ప్రాచీన కాలంనుంచీ రాజుల కీర్తిప్రతిష్ఠలకు ఆలవాలం రాణులు ధరించే భారీ ఆభరణాలే. అందుకే రాజ్య సంపదలో సింహభాగం ఆభరణాల రూపంలో ఖజానాలో నిల్వ ఉండేది. అవే పరిస్థితులు ప్రస్తుతం కూడా కనిపిస్తున్నాయి. ఖరీదైన నగలే కాకుండా ఫ్యాషనబుల్ ఆభరణాలను ధరించడం స్టేటస్ చిహ్నంగా మారింది. పెళ్లిళ్లు, పండుగల వేళ తమ స్థాయికి తగ్గట్టుగా సింగారించుకుంటారు. రకరకాల కుందన్లు, రాళ్లు, రత్నాలు పొదిగిన నగలకు ప్రాధాన్యం ఇస్తారు. దుస్తులకు నప్పేలా బంగారం, వెండి, ప్ల్లాటినం వంటి లోహాలతో చేసిన ఆభరణాలే కాకుండా ట్రెండ్‌కు తగినట్టు ఫ్యాబ్రిక్, సిల్క్, రూబీ, కుందన్, పోల్కీ..నగలనూ ధరిస్తున్నారు.

♦ నాలుగు రకాలు..
స్టేట్మెంట్ నగలు నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి.. స్టేట్మెంట్ నెక్లెస్‌లు, చెవి కమ్మలు, బ్రేస్లెట్లు, ఉంగరాలు. స్టేట్మెంట్ నెక్లెస్‌లను ఎక్కువగా ప్రకృతి ప్రేమికుల కోసం రూపొందిస్తారు. వీటిలో ఎక్కువగా అన్‌కట్ డైమండ్స్, ఎమరాల్డ్, రూబీ, బ్లూస్టోన్స్, ముత్యాలను పొదుగుతారు. హుందాతనాన్ని తీసుకొచ్చే ఈ నగలను ప్రత్యేకించి శుభకార్యాలకు ధరిస్తారు. పార్టీలలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
స్టేట్మెంట్ చెవి కమ్మల్లో చాలా రకాలు ఉన్నాయి. నెక్లెస్‌ల మీదికి నప్పే కాంబోలతోపాటు రోజువారీ ఉపయోగానికి చిన్నగా, ఫ్యాషనబుల్‌గా ఉండే పలు డిజైన్లను రూపొందిస్తున్నారు. స్టేట్మెంట్ బ్రేస్లెట్లు, ఉంగరాలు చాలా ప్రత్యేకమైనవి. వీటిని ఎక్కువగా విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించిన చిహ్నాలతో తయారు చేస్తున్నారు. ధరించే నగలను బట్టి మహిళల ఇష్టాలు, ఆలోచనలతోపాటు వ్యక్తిత్వాన్నీ తెలుసుకోవచ్చని అంటారు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం








