మారిన ఫ్యాషన్.. కొత్త రంగులు, వింత షేడ్స్‌లో నెయిల్ పాలిష్
Nail Art | అమ్మాయిల అలంకరణలో ఎన్నో కోణాలు. వస్త్రాలంకరణ, కేశాలంకరణ, నేత్రాలంకరణ, అధరాలంకరణ, హస్తాలంకరణ.. వీటితోపాటు గోళ్ల ముస్తాబు కూడా! అందులోనూ ఇప్పుడు, యువత ఫ్రెంచ్ మానిక్యూర్ ( Manicure Ideas) అంటే ఇష్టపడుతున్నది. ఈ మానిక్యూర్ గతం నుంచీ ఉన్నా.. రకరకాల మార్పులు తీసుకొచ్చారు నెయిల్ ఆర్టిస్ట్‌లు.
ఒకప్పుడు ఎరుపు, గులాబి రంగు నెయిల్ పాలిష్‌లను మాత్రమే గోళ్లకు వేసుకునేవారు. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. కొత్త రంగులు, వింతవింత షేడ్స్ అందుబాటులో ఉన్నాయి. రకరకాల ప్యాటర్న్లు, డిజైన్లలో మార్కెట్‌ను దున్నేస్తున్నారు ఫ్రెంచ్ మానిక్యూర్ కళాకారులు. ఆ ట్రెండ్స్‌లో కొన్ని..

సైడ్ డిప్..
ఈ పద్ధతిలో మానిక్యూర్ తర్వాత గోళ్లకు నచ్చిన రంగుతో నెయిల్ పాలిష్ వేయాలి. అది కూడా గోరు మొత్తానికి కాకుండా ఒకవైపు అంచులకు మాత్రమే. ఒకే రంగు కాకుండా గోటికో వర్ణాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక గోటికి ఒక రంగు వాడాలన్నది నిబంధన. చెమ్కీ పాలిష్‌తో అన్ని గోళ్లకూ ఒకే రంగు వేసినా సూపర్.

అబ్స్ట్రాక్ట్ ఆర్ట్..
గోళ్లపై ఎవరికి నచ్చిన డిజైన్లు వాళ్లు వేసుకునేందుకు ఈ శైలి ఉపకరిస్తుంది. ఇందులో గీతలు, చుక్కలు, మెలికల గీతలు.. ఇలా నచ్చినట్లుగా గోళ్లపై డిజైన్ వేయాలి. అందులోనూ ఒక్కో గోటిపై ఒక్కోలా డిజైన్ ఉండొచ్చు. కానీ చాలామంది మెలికలను ఇష్టపడతారు. అందులో కూడా ఒకే రంగును ఎంచుకోవచ్చు. ముందుగా గోళ్లకు రంగులేని నెయిల్ పాలిష్‌ను ఒక కోటింగ్ వేయాలి. అది ఆరిపోయాక, ఏదైనా రంగు పాలిష్‌తో ఒక్కో గోటిపై ఒక్కోలా డిజైన్ చేసుకోవచ్చు.

డబుల్ డెక్కింగ్..
మినిమలిస్ట్లకు ఈ డిజైన్ బాగా నచ్చుతుంది. ముందు బేస్కోట్గా ఒక రంగు నెయిల్ పాలిష్ వేయాలి. అది ఆరిపోయాక గోరు చివర్లకు కాంట్రాస్ట్ రంగులో సన్నని గీతలు వేయాలి. ఒకటి లేదా రెండు గీతలు వేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే, మొత్తంగా ఈ డిజైన్‌కి రెండు రంగులు మాత్రమే ఉపయోగిస్తేనే అందంగా ఉంటుంది. రంగులు పెరిగితే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

క్యూటికల్ టిప్స్..
గోళ్ల అడుగుభాగంలో సన్నగా డిజైన్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్. పూర్తి గోటికి రంగురంగుల నెయిల్ పాలిష్ వేసినా, వేయకపోయినా ఇలా అడుగుభాగంలో నచ్చిన రంగు వేయాలి. అందులోనూ చెమ్కీ పాలిష్ ఎంచుకుంటే మరింత అందంగా ఉంటుంది. అలాగే బాగా నచ్చిన రెండు రంగులు తీసుకుని అడుగుభాగంలో ఒకటి, గోరు చివర్లకు ఒకటి
ఎంచుకోవచ్చు. వాటితో సన్నగా డిజైన్ చేయవచ్చు.

పోల్కా పాప్స్..
ఈ నెయిల్ ఆర్ట్‌లో నచ్చిన రంగుతో గోళ్లపై బేస్ కోట్ వేయాలి. దానిపై మార్కెట్లో దొరికే త్రీడీ పోల్కా డాట్స్ పెయింట్‌తో చుక్కలు పెట్టాలి. పొడవాటి గోళ్లు ఉన్నవాళ్లకు ఈ డిజైన్ బాగా నప్పుతుంది. గోళ్లకు వేసుకునే రంగును బట్టి చుక్కల రంగును ఎంచుకోవాలి. ఒకటి ముదురు రంగులో ఉంటే, ఇంకోటి లేత రంగులో ఉండాలి. ఈ డిజైన్‌లో కూడా అన్ని గోళ్లకూ ఒకే రంగు వేసుకోనక్కర్లేదు.
Read More :
గోళ్లు కొరుకుతున్నారా? ఈ అలవాటు మానకపోతే ఎంత ప్రమాదమో తెలుసా !!”
“Between the Finger Rings | రెండు వేళ్లకు ఒక్కటే ఉంగరం.. ఆకట్టుకుంటున్న నయా ట్రెండ్”
Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

