పంటికి కూడా నగలు వేసుకుంటారని తెలుసా.. ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న నయా ట్రెండ్ ఇది
Teeth Grillz | ఫ్యాషన్ ప్రపంచాన్ని ‘టీత్ గ్రిల్స్’ ట్రెండ్ ఉర్రూతలూగిస్తున్నది. దంతాలకు బంగారు రంగు వేయించుకోవడం, బంగారు పన్ను కట్టించుకోవడం పాత ఫ్యాషన్లు. ఇప్పుడు.. పంటికి నగలను తొడుగుతున్నారు. పంటి మీద సువర్ణాక్షరాలు లిఖించుకుంటున్నారు. హృదయాకారం, పొడి అక్షరాలు, గుర్తు, లక్కీ నంబర్.. డిజైన్ చేయించుకొని మరీ ధరిస్తున్నారు. నోరు తెరిస్తే చాలు.. కోలార్ గనులే. టీత్ గ్రిల్స్‌లో రకరకాలు. శాశ్వతంగా పళ్లకు అమర్చేవి కొన్ని, అవసరమైనప్పుడు పెట్టుకునేవి మరికొన్ని..

కాకపోతే, మీరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకుంటే.. పై పంటికి వేయించుకుంటారా, కింది పంటికి వేయించుకుంటారా అన్నది నిర్ణయించుకోవాలి. ఒక పంటికి సరిపోతుందా, ఏకంగా నోరంతా బంగారపు తాపడం చేయించుకుంటారా అన్నది తేల్చుకోవాలి. బంగారం, స్టెర్లింగ్ సిల్వర్, ప్లాటినం.. ఏ లోహాన్ని ఎంచుకుంటారో మీ ఇష్టం. వాటి పైన వజ్రాలు, రత్నాలు, రంగురాళ్లు వంటివి పొదిగితే ఖర్చు ఇంకొంత పెరుగుతుంది. ఒకటి రెండు కాదు.. మొత్తంగా పైన ఎనిమిది, కింద ఎనిమిది పళ్లకు అలంకరించుకోవడానికి వీలుగా అమెజాన్‌లో పలురకాల పంటినగలు లభిస్తున్నాయి. తెల్లని పండ్ల మీద కృష్ణవర్ణమైతే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే ఉద్దేశంతో బ్లాక్ మెటల్‌ను ఎంచుకుంటున్నవారూ చాలా మందే ఉన్నారు.

జాగ్రత్త జాగ్రత్త..
అయితే ఓ చిన్న హెచ్చరిక. దీనివల్ల భవిష్యత్తులో దంతక్షయం రావచ్చు. ఆ నగలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే దుర్వాసన ఇబ్బంది పెట్టవచ్చు. తింటున్నప్పుడో, తాగుతున్నప్పుడో ఆ ఆభరణాల ముక్కలు గొంతులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టే, చాలా విద్యాసంస్థలు ఈ ఫ్యాషన్‌ను నిషేధించాయి. అయినా, ఆ ఫ్యాషన్పట్ల మమకారం వీడకపోతే డెంటిస్ట్ సహకారంతోనే అమర్చుకోవాలి. అందం ముఖ్యమే. కానీ ఆరోగ్యం అంతకంటే చాలా ముఖ్యం. పళ్లు ఉంటేనే .. బంగారు తొడుగైనా, వజ్రాల మెరుపులైనా! కాబట్టి, దంతాల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ‘నవ్వును మించిన ఆభరణం ఏముంది? పైసా ఖర్చు ఉండదు’ అన్న సలహానూ కొట్టిపారేయలేం.



Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

