Cleopatra Choker | ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర వాడిన ఈ నగల నమూనా ఇప్పటికే ట్రెండింగ్నే!!
Cleopatra Choker | క్లియోపాత్రా ముక్కు మరోలా ఉంటే, ప్రపంచ చరిత్ర ఇంకో మలుపు తిరిగేదని ఛలోక్తి. చరిత్రలో తనకంటూ ఓ పేజీ ఉన్న క్లియోపాత్రా ఈజిప్టు రాణి. ఆమె అలంకరణ ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఇప్పటికీ ఆమె ధరించిన నగల నమూనాలు మహిళల మనసులను దోచేస్తున్నాయి. ఈజిప్టు సంస్కృతి, సంప్రదాయాలు మేళవించిన క్లియోపాత్రా ఆభరణాలను ప్రపంచమంతా ఇష్టపడతారు.

బంగారం కాకపోయినా..
క్లియోపాత్రా చోకర్లను ఆఫ్రికన్లు చాలా ఇష్టపడతారు. అక్కడి సామాన్యులకు అందుబాటులో ఉండేలా బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలతోనే కాకుండా.. రాగి, ఇత్తడి, కంచు తదితర చవకైన లోహాలతోనూ చోకర్లను రూపొందిస్తున్నారు. స్థానికంగా దొరికే పూసలు, గవ్వలు, రంగు రాళ్లను ఈ ఆభరణాలకు జోడిస్తారు. ఫ్యాబ్రిక్, సిల్క్, త్రెడ్ జువెలరీలోనూ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, ఆ అందగత్తెకు మరింత అందం తెచ్చిన కంఠాభరణం చాలా ప్రసిద్ధి. నగల చరిత్రలో ఆ డిజైన్ ఆమె పేరిటే నిలిచి పోయింది. కంఠం చుట్టూ అమరిపోయే ఈ భారీ నగను పోలిన డిజైన్లు అనేకం పుట్టుకొచ్చాయి. పాము ఆకారంలోని వంకీలూ ప్రత్యేకమే.

ఒక్కటే నిండుగా..
మెడకిందుగా పరుచుకునేలా భారీ ఆభరణాన్ని ధరించేవారు ఈజిప్టు రాణెమ్మలు. ఈ నగలను ఎక్కువగా 18 క్యారెట్ల బంగారంతోనే చేస్తారు. దీంతో చూడటానికి భారీగా ఉన్నా ధర తక్కువే ఉంటుంది. సంప్రదాయ దుస్తులపై ఈ రకమైన చోకర్లను ధరిస్తే నిండుగా, హుందాగా ఉంటుంది. వన్‌గ్రామ్ గోల్డ్ వంటి ఇమిటేటెడ్ నగల్లోనూ ఈ చోకర్లు అందుబాటులో ఉన్నాయి. క్లియోపాత్రా చోకర్ల్లు, వంకీల్లానే మరికొందరు ప్రముఖుల పేర్ల మీద కూడా ఆభరణాలు ప్రసిద్ధి చెందాయి. ఎలిజబెత్ రాణి ప్రతిబింబం ఉన్న డాలర్లతో చేయించిన పెండెంట్లు, నిజాం రాజు ధరించిన వజ్రపు కిరీటం నమూనాలోని నగలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

Read More :
“3D Jewelry | ఆకట్టుకుంటున్న త్రీడీ నగలు.. ఇక పాత డిజైన్లు మరిచిపోవాల్సిందే..”
Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి”
“ఒకప్పుడు పాప్ ప్రియులను ఊపు ఊపిన ఫ్యాషన్ ట్రెండ్ మళ్లీ వచ్చేసింది!!”
“Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Denim darzi | నయా ట్రెండ్.. చీరతో భాగమైన ఈ కొత్తరకం జీన్స్ గురించి ఐడియా ఉందా !”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

