Denim darzi | నయా ట్రెండ్.. చీరతో భాగమైన ఈ కొత్తరకం జీన్స్ గురించి ఐడియా ఉందా !
Denim darzi | జీన్స్ ప్యాంట్, జీన్స్ షర్ట్ కాంబినేషన్ సూపర్బ్. కానీ, జీన్స్‌ను చీరలో భాగం చేయడం ఎప్పుడైనా చూశారా? అవును. కుర్తాలో కలిపి.. జాకెట్‌గా మార్చి.. జిగేల్మనిపించే జీన్స్ ఇప్పుడో ట్రెండ్. ఆ కొత్త స్టైల్‌కు చిరునామా.. ‘డెనిమ్ దర్జీ ( Denim darzi )’. ఫ్యాషన్ ప్రపంచంలో బాప్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్స్ అనిపించుకుంటున్న ‘డెనిమ్ దర్జీ’ కథేమిటంటే…
జీన్స్ ఫ్యాబ్రిక్స్‌లో ఎక్కువ కాలం మన్నిక ఉండేది డెనిమ్ ఒక్కటే. 19వ శతాబ్దంలో అమెరికాలో కార్మికుల కోసం పురుడుపోసుకున్న ఈ వస్త్రం.. పాప్ సంస్కృతికి చిహ్నంగా మారింది. ఇప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తన హవా కొనసాగిస్తూనే ఉన్నది. ఇన్నాళ్లూ ప్యాంట్, షర్ట్‌కే పరిమితమైన డెనిమ్ క్లాత్‌కు సరికొత్త రూపం ఇచ్చింది కోల్‌కతాకు చెందిన రూపాలి. చీర, బ్లేజర్లు, కుర్తా, ధోతీ, స్కర్ట్, బ్లౌజ్, గౌన్లు, లెహంగాలు.. ఒకటేమిటీ అందంగా కనిపించే ప్రతీ వస్త్రంతో చేర్చి సరికొత్త ఫ్యాషన్‌ను ఆవిష్కరించింది. దీనికి ‘డెనిమ్ దర్జీ’ అని నామకరణం చేసింది.
ఇదీ దర్జీ కథ..
2020లో మొదటి లాక్డౌన్ వచ్చింది. అప్పటికి బెంగాలీ వనిత రూపాలీ ముఖర్జీ గర్భవతి. భర్త, పిల్లల కోసం ఆమె డెనిమ్ మెటీరియల్ కొనుగోలు చేసేది. ఒకరోజు బీరువా సర్దుతుండగా చాలా డెనిమ్ వస్త్రాలు దొరికాయి. అప్పుడే తనకో ఆలోచన వచ్చింది. టైలరింగ్‌లో నేర్పరి అయిన రూపాలి పుట్టబోయే పాప కోసం వాటితో సరికొత్తగా కుట్టడం మొదలుపెట్టింది. తన చీర అంచులకు, జాకెట్లకు కూడా డెనిమ్ క్లాత్‌ను ఉపయోగించింది. నాలుగైదు జీన్స్ ప్యాంట్లను కత్తిరించి భర్తకు బ్లేజర్ సిద్ధం చేసింది. వాటిని చూసి స్నేహితులు, బంధువులు మెచ్చుకున్నారు. తమకూ అలాంటివే కావాలని కోరారు. దీంతో, టోకుగా డెనిమ్ మెటీరియల్ తెప్పించి పని మొదలుపెట్టింది. తన వస్ర్తాలకు ‘డెనిమ్ దర్జీ’ అనే బ్రాండ్ నేమ్ ఇచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు రూపాలి. తన దగ్గర సమ్మర్ జాకెట్స్, డెనిమ్ పోల్కా చీరలు, డెనిమ్ కుర్తాలు, డెనిమ్ ధోతీలు అధికంగా అమ్ముడుపోతున్నాయి. వీటి ధరలు రూ.2,500 నుంచి ప్రారంభం అవుతాయి. రెడీమేడ్ దుస్తులు చాలామందికి సరిపోకపోవచ్చు. అలాంటివారికి రూపాలి టైలరింగ్ సేవలనూ అందిస్తున్నది. ఆర్డరు ఇవ్వగానే డెనిమ్ దర్జీ నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. వీడియో కాల్లో కొలతలు తీసుకుంటారు. వివరాలకు www. denimdarzi.com వెబ్సైట్లో లాగిన్ కావచ్చు.

Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video










