floral choker | మెడచుట్టూ చుట్టుకునే చోకర్‌కు పువ్వు పూస్తే.. అదే ఫ్లవర్ చోకర్! గులాబీ నుంచి పొద్దుతిరుగుడు వరకూ అది ఏ పుష్పమైనా కావచ్చు. మన మూడ్‌ను బట్టి నచ్చిన పుష్పాన్ని ఎంచుకుని చోకర్‌కు జోడించుకునే వెసులుబాటూ ఉంది. నిజానికి, 2000వ సంవత్సర ప్రారంభంలో పాప్ ప్రియులను ఓ ఊపు ఊపిన ఫ్యాషన్ ట్రెండ్ వైటూకే. అందులో భాగమైన ఫ్లవర్ చోకర్స్ మళ్లీ రాజ్యమేలుతున్నాయి. ఈ సంగతి పుష్పరాజ్‌కు తెలిస్తే.. ‘చోకర్ అంటే మెడకు చుట్టుకునే దస్తీ అనుకున్నావా.. ఫ్లవర్! వైటూకే ఫ్యాషన్ విషయంలో తగ్గేదే లే’ అంటాడేమో!
ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది”
“Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Statement Jewelry | మగువల మనసు తెలిపే ప్రత్యేక నగలు ఇవి.. వీటి ప్రత్యేకతలు ఏంటంటే..”
“jaipur jewellery | ఆధునిక యువతులను ఆకర్షిస్తున్న రాజపుత్ర రాచకన్యల నగల గురించి తెలుసా”