One Gram Gold Jewellery | వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చేయించుకోండి!!
One Gram Gold Jewellery | నగలు మగువల గుత్తసొత్తు. స్వర్ణాభరణాలు ధరించి సొగసులీనినా, వెండి నగలు పెట్టుకుని వగలొలికించినా, గిల్టు నగల్లో గారాలు పోయినా వాళ్లకే చెల్లు. అయితే వన్నెతరగని పసిడి మీద ముదితలకు ఉండే ప్రేమ భిన్నమైనది. అందుకే అచ్చం బంగారు ఆభరణాలను పోలిన వన్‌గ్రామ్ గోల్డ్ నగలు మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు వీటిని కూడా బంగారు ఆభరణాల్లా ఆర్డరిచ్చి మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు.

మార్కెట్లోకి వన్‌గ్రామ్ గోల్డ్ నగలు రాకముందు గిల్టు నగలకీ, బంగారు నగలకీ చూసేందుకు చాలా తేడా ఉండేది. ఫ్యాషన్‌గా పెట్టుకోవడానికే తప్ప గిల్టునగలు పెండ్లిల్లలాంటి పెద్ద వేడుకలప్పుడు ధరించడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ, ఇత్తడేదో పుత్తడేదో తెలియనంతగా అందమైన రాళ్లు నగిషీలతో మెరిసిపోతూ వన్‌గ్రామ్ గోల్డ్ నగలు రావడంతో వయసు భేదం లేకుండా చిన్నా పెద్దా అందరూ వీటిని ఇష్టంగా ధరిస్తున్నారు. చెవిపోగుల నుంచి కాలిపట్టీల దాకా, హారాల నుంచీ వడ్డాణాల దాకా అచ్చంగా బంగారానివేమో అనిపించేలా ఇవి రూపొందుతున్నాయి.

సరికొత్తగా పచ్చలూ, కెంపులూ, పగడాల దండలు సహా రకరకాల పూసలలో బంగారం ఇమిడ్చి నగలు చేయించుకుంటున్నారు మగువలు. ఇప్పుడు వాటిని పోలి కూడా వన్‌గ్రామ్ గోల్డ్ నగలు తయారవుతున్నాయి. ఇప్పటిదాకా వన్‌గ్రామ్ గోల్డ్ నగలంటే ఉన్నవి ఉన్నట్టుగా కొనుక్కోవడమే. ఇప్పుడు మనకు ఏదైనా బంగారు నగ నచ్చితే దానిలాగానే వీటినీ చేయించుకోవచ్చు. మనకు నచ్చిన ఆభరణం ఫొటోను ఇమిటేషన్ నగల తయారీ సంస్థలకు పంపితే అచ్చం దానిలానే కనిపించేలా వన్‌గ్రామ్ ఆభరణం తయారుచేస్తున్నారు. అంటే వాటిలో ఉండే పచ్చలూ కెంపులూ, కుందన్లూ, ఇతర రాళ్లూ, ముత్యాలూ అన్నీ బంగారం నగలో ఉపయోగించేవే వాడుతున్నారు. కాకపోతే బంగారం స్థానంలో వేరే లోహం ఉపయోగిస్తారు. గోల్డ్ రెప్లికా నగలను మన దగ్గర ఎంసీఎస్ ఎంపైర్, బాబు కలెక్షన్స్ ఇలా పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అలాంటి గోల్డ్ రెప్లికా మోడల్సే. వీటిని చూస్తుంటే ఈ సింగారాలన్నీ బంగారానివేమో అనిపించేలా ఉన్నాయి కదూ!

Read More :
Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్”
హైదరాబాదీ కళలను ఆకట్టుకుంటున్న ఈ అరబిక్ డిజైన్స్ గురించి తెలుసా”
Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!”
“Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

