Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్
Unfinished Jewelry | రొటీన్‌కు భిన్నంగా ఉండటమే ఫ్యాషన్. తళుకుబెళుకుల ప్రపంచంలో అందరి దృష్టినీ ఆకర్షించాలంటే ఎంతోకొంత భిన్నంగా ఉండాలి. ఆ భిన్నత్వం వైవిధ్యమైన నగలతోనే సాధ్యం. చూడ్డానికి అసంపూర్ణంగా కనిపించినా, కొన్ని నగలు సౌందర్యానికి సంపూర్ణ నిర్వచనం ఇస్తాయి. అలాంటి ఆభరణాలనే మగువలు ఇష్టపడుతున్నారు.

పరిపూర్ణత్వంలో అందం ఉంటుంది. అపరిపూర్ణతలో వైవిధ్యం ఉంటుంది. ఓ నగకు ఎనభైశాతం రూపాన్నిచ్చి, ఇంకో ఇరవైశాతాన్ని మన ఊహకే వదిలిపెడతారు డిజైనర్లు. కమ్మలు, ఉంగరాలు, గాజులు, గొలుసులు.. ఇలా అన్ని రకాల డిజైన్లకూ ఈ సూత్రాన్ని అన్వయిస్తున్నారు. చివర్లను కలపకుండా అలానే వదిలేస్తారు. కాబట్టే, చూసేందుకు కొత్తగా కనిపిస్తుంది. రాళ్లు, ముత్యాలు, వజ్రాలను పొదిగే హారాలు, చోకర్లను సైతం మధ్యలో వదిలేసినట్టు డిజైన్ చేస్తున్నారు. అయినా, అసంపూర్ణమైన నగల ట్రెండ్ ఇప్పుడు పుట్టుకొచ్చిందేం కాదు. ప్రాచీన నగల్లో ఇలాంటి డిజైన్లు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మెడలో ధరించే కంటెలు, ముంజేతి కడియాలు, కాళ్ల కడియాలు, మెట్టెలు, వడ్డాణం, వంకీలు.. అసంపూర్ణ స్వరూపాలే. ఆ ఆభరణాలకే ఆధునిక సొబగులద్ది కొత్తగా మలుస్తూ నేటి తరాన్ని ఆకట్టుకుంటున్నారు తయారీ దారులు.

కంటెలు.. కడియాలు
ప్రాచీన అసంపూర్ణ ఆభరణాలైన కంటెలు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. దీపికా పదుకొనె, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా వంటి సెలెబ్రిటీలు పార్టీలు, ఫంక్షన్లలో వీటిని ధరించడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. కడ్డీల్లా కాకుండా రంగురంగుల రాళ్లు, రత్నాలు, వజ్రాలు పొదిగి చివర్లను ప్రకృతి అందాలైన పువ్వులు, ఆకులతో మలుస్తున్నారు. ఆడ, మగ తేడా లేకుండా చేతి కంకణాలుగానూ వీటిని ధరిస్తున్నారు. వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జువెలరీలోనూ ఈ డిజైన్లు వచ్చేశాయి. ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ పొందుతున్న రోజ్ గోల్డ్ జువెలరీలోనూ ఇవి సందడి చేస్తున్నాయి.
Read More :
Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”
“Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!”
“Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

