Stone Carving Jewellery | ఈ రాతి నగలు ధరిస్తే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా?
Stone Carving Jewellery | బీచ్లోనో, జలపాతాల దగ్గరో నున్నగా, అందంగా ఏ రాయి కనిపించినా మనసు పారేసుకుంటాం. ఆ సహజ సౌందర్యానికి పాషాణ హృదయాలు సైతం కరిగిపోతాయి. ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటాం. వీలైతే బ్యాగులో వేసుకుంటాం. అవకాశం ఉంటే షోకేస్‌లో కాస్తంత చోటిస్తాం. ఓ అడుగు ముందుకేసి.. ఆభరణాలుగా మలుచుకుంటున్నవారూ ఉన్నారు. కాబట్టే, ‘స్టోన్ కార్వింగ్ జువెలరీ’ మహిళల ముస్తాబులో భాగం అవుతున్నది.

కంటికి ఇంపుగా కనిపించే రకరకాల కూరగాయలు, పండ్లను కళాత్మకంగా కార్వింగ్ చేస్తారు పాకశాస్త్ర నిపుణులు. అలానే, తళుకులీనుతున్న రాళ్లను మరింత అందంగా చెక్కి చక్కని ఆభరణాలుగా మలుస్తున్నారు జువెలరీ డిజైనర్లు. పల్చగా ఉన్న నున్నని రాళ్లను చెవికమ్మలు, పెండెంట్లు, లాకెట్లుగా మార్చేస్తున్నారు. వాటి సహజ ఆకృతిని ఆసరాగా చేసుకుని రంగురంగుల బొమ్మలు వేసి ఆకట్టుకునే ఆభరణాలను రూపొందిస్తున్నారు.

దేవుళ్లు, జంతువులు, పక్షుల రూపాలను చెక్కిన పెండెంట్లూ అందుబాటులో ఉన్నాయి. బంగారం, వెండి, ప్లాటినం ప్రస్తావన లేదు కాబట్టి.. ధర చవకే. సాక్షాత్తు ప్రకృతే తీర్చిదిద్దుతుంది కాబట్టి, వైవిధ్యానికి కొదవ లేదు. ఈ యూనిసెక్స్ జువెలరీని పురుషులూ సింగారించుకోవచ్చు.

స్టోన్ కార్వింగ్ నగలు ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి. వీటిని ధరించడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలూ తలెత్తవు. ఆ స్పర్శతో మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సంప్రదాయ దుస్తులతోపాటు వెస్ట్రన్‌వేర్ పైనా చక్కగా అమరిపోతాయి. కాలేజీ, ఆఫీసు అలంకరణలోనూ భాగం చేసుకోవచ్చు. ఏ సముద్రతీరానికో వెళ్లినప్పుడు సేకరించి తెచ్చుకుంటే.. మన నగలకు మనమే డిజైనర్లు అయిపోవచ్చు.

Read More :
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

