దుస్తులే కాదు చెప్పులు, బ్యాగులు అన్నిటిపైనా ముత్యాలే ఫ్యాషన్.. అసలు వీటి వాడకం ఎప్పుడు మొదలైంది?
Pearl Fashion | స్వచ్ఛమైన తెలుపుతో, అచ్చమైన మెరుపుతో ఇట్టే ఆకట్టుకుంటాయి ముత్యాల ఆభరణాలు. ముత్యాల నగలు ధరిస్తే.. అలంకరించుకున్న వారికి అందం, చూసే కళ్లకు ఆహ్లాదం. కాబట్టే, ఆభరణాలకే పరిమితం కాకుండా దుస్తులు, చెప్పులు, బ్యాగుల పైనా ముత్యాలను అద్దుతున్నారు. ఇంకేముంది.. ముచ్చటైన ముత్యాలు నిలువెల్లా మెరిపిస్తున్నాయి.
హైదరాబాద్ ముత్యాల నగరంగా సుప్రసిద్ధం. ముత్యాలకు వేల ఏండ్ల చరిత్ర ఉంది. చైనాలో నాలుగు వేల సంవత్సరాల కిందటే ముత్యాలను వాడినట్లు చరిత్ర చెబుతున్నది. ముత్యాలు.. ఒక్క తెలుపులోనే కాదు, ఇంద్రధనుస్సులోని అన్ని రంగుల్లోనూ లభిస్తాయి. వివిధ ఆకృతుల్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని నీటి బిందువు ఆకారంలో, కొన్ని అండాకారంలో, కొన్ని అర్ధ వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవీ, బిందు ఆకారంలో మెరిసిపోయేవీ మరింత ధర పలుకుతాయి. ముత్యాల నిర్మాణం పొరలుపొరలుగా ఉంటుంది. అందుకే అంత బలం. ఓ పట్టాన పగిలిపోవు.
ముత్యాల నగలను ధరించే సంప్రదాయం త్రేతాయుగం నుంచీ ఉంది. రామాయణంలో ఓ చోట ఇరవయ్యేడు రకాల ముత్యాలతో అల్లిన హారం గురించిన వర్ణన ఉంది. శ్రీకృష్ణుడికి ముత్యాల హారాలంటే ఇష్టమని భాగవతం చెబుతున్నది. క్లియోపాత్రా ఓ ఖరీదైన ముత్యాన్ని వెనిగర్‌లో కరిగించి తాగి మరీ.. తానెంత ధనవంతురాలో లోకానికి చాటిచెప్పింది. రోమన్లు
రాచ మహిళల సమాధుల్లో ముత్యాలను ఉంచేవారట. హైదరాబాద్‌లో ఏడాదికి 500 కోట్ల రూపాయల ముత్యాల వ్యాపారం జరుగుతుందని అంచనా. సహజంగా తయారయ్యే ముత్యాల ధరలు ఎక్కువే. తక్కువలో కావాలనుకునే వారికి కృత్రిమ ముత్యాల నగలు అందుబాటులోకి వచ్చేశాయి. డిజైనర్లు వాటిని దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులపైనా పొదుగుతున్నారు. పాశ్చాత్య, సంప్రదాయ దుస్తులపై ఈ ముత్యాల వరుసలు మరింత అందాన్ని తెచ్చి పెడుతున్నాయి. టోపీలు, చెప్పులకు జతచేయడంతో ఒక థీమ్లాంటి కాంబోలు మార్కెట్లోకి వచ్చేశాయి. కాలర్పీస్గా ప్రసిద్ధిచెందిన ముత్యాల వరుసలతో కూడిన నగలను.. పొడవాటి గౌన్లపై ధరిస్తారు. ఇవి పార్టీల్లో, వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వాచీలు, బ్రేస్లెట్లు, పట్టీలు.. ఒకటేమిటి ప్రతి వస్తువుకూ ముత్యపు మెరుపు మెరుపే. ఆ అలంకరణలో మహిళ కడిగిన ముత్యమే!
Read More :
“ఏ కలర్ చీరకైనా మ్యాచ్ అయ్యే ఈ సప్తవర్ణాల నగల గురించి ఐడియా ఉందా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

