ఏ కలర్ చీరకైనా మ్యాచ్ అయ్యే ఈ సప్తవర్ణాల నగల గురించి ఐడియా ఉందా?
Rainbow Jewellery | సాదాసీదా డ్రెస్ కావచ్చు, కంచిపట్టు చీరా కావచ్చు. అందమైన నగలు తోడైతేనే అలంకరణ పూర్తయినట్టు. కొందరంతే! వర్ణాభిమానులు. ఏ రంగు వస్త్రానికి ఆ రంగు నగలు ఉండాల్సిందే. కానీ, ఆ కలర్ కాంబినేషన్ అన్నిసార్లూ కుదరకపోవచ్చు. అలాంటప్పుడు, ఇంద్రధనుస్సు నగలు ధరిస్తే సరిపోతుంది. సప్త వర్ణాల్లోని ఏదో ఓ రంగు చీరకు కచ్చితంగా మ్యాచ్ అవుతుంది.

బంగారం అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. పచ్చని పసుపు రంగు. మెరుపులో పసిడి వన్నెకు సాటిలేదు. అయితే బంగారం తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా, నీలం, నలుపు రంగుల్లోనూ వస్తున్నది. రోజుకో డ్రెస్ వేసుకున్నట్లే బంగారు నగల్ని కూడా రోజుకో రంగులో ధరించవచ్చు. అలా కాదనుకుంటే, అన్నిరంగులనూ కలగలిపి నగలను చేయించుకోవచ్చు. పాశ్చాత్యదేశాల్లో రోజ్, వైట్‌గోల్డ్ నగల ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా రష్యన్లకు రోజ్‌గోల్డ్ అంటే ప్రాణం. పెళ్లి ఉంగరాలు, వాచీలు అయితే శ్వేతవర్ణంలో, లేకపోతే గులాబీ రంగులో మెరిసి పోతాయి. గులాబీ, తెలుపు, పసుపు.. మూడు రంగుల జుగల్బందీ అంటే మరింత ఇష్టపడతారు. ఈమధ్య వాటితో పాటు ఆకుపచ్చ నగల్ని ధరించడం ట్రెండ్‌గా మారింది. బంగారంలో అన్నన్ని రంగులు చూశాక జువెలరీ డిజైనర్ల ఆలోచనలకు రెక్కలొచ్చాయి.

రంగుల కథ..
స్వచ్ఛమైన బంగారం పసుపు పచ్చగానే ఉంటుంది. కానీ దాన్ని యథాతథంగా ఆభరణాలకు వాడలేం. అందుకే కాడ్మియం, రాగి, ఇండియం తదితర లోహాల్లో ఏదో ఒకటి కలుపుతారు. కొద్దిపాళ్లలో వెండినీ జోడిస్తారు. అప్పుడే, నగల తయారీ వీలవుతుంది. రాగి శాతాన్ని 20 నుంచి 65 శాతం వరకూ పెంచితే.. రోజ్‌గోల్డ్. రాగి పరిమాణాన్ని బట్టి బంగారం గులాబీ, ముదురు గులాబీ, నారింజ, ఎరుపు.. ఇలా వివిధ రంగుల్లోకి మారుతుంది. వైట్‌గోల్డ్ కోసం అయితే రాగి, జింక్‌తో పాటు నికెల్ లేదా పలాడియం, వెండి కలుపుతారు. ఇక బంగారాన్ని ఆకుపచ్చగా మలిచి ముస్తాబు చేసుకోవడం అన్నది చాలాకాలం నుంచీ ఉన్నదే. క్రీస్తుపూర్వమే ఆకుపచ్చని బంగారం వాడుకలో ఉంది. 75 శాతం బంగారానికి 23 శాతం వెండి, రెండు శాతం కాడ్మియం కలిపితే ఆకుపచ్చ బంగారం సిద్ధం. మరింత ముదురాకుపచ్చలోకి మారాలంటే మాత్రం 15 శాతం వెండి, ఆరు శాతం రాగి, నాలుగు శాతం కాడ్మియం కలుపుతారు. నీలి వర్ణం కోసం తగుపాళ్లలో ఐరన్ లేదా ఇండియం జోడిస్తారు. వంకాయ లేదా ఊదా రంగు బంగారం కోసం అల్యూమినియం కుమ్మరిస్తారు. 75 శాతం బంగారానికి 25 శాతం కోబాల్ట్ కలిపితే నల్ల బంగారం సిద్ధం. అచ్చమైన బంగారు నగలకు.. రంగురంగుల రాళ్లు, రత్నాలు కూర్చడం ద్వారా సప్తవర్ణ సోయగం తీసుకొస్తున్నారు. ప్లాస్టిక్, గాజు, బీడ్స్ వంటి పూసలతోనూ ఇంద్రధనువును తలపించే హారాన్ని డిజైన్ చేస్తున్నారు.

Read More :
కాఫీ తోటలు, గ్రామీణ శైలి స్ఫూర్తితో రూపొందిన ఈ నగల గురించి తెలుసా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

