కాఫీ తోటలు, గ్రామీణ శైలి స్ఫూర్తితో రూపొందిన ఈ నగల గురించి తెలుసా
Jewelry |‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అని పాడితే విన్నాం, ఆనందించాం. కానీ అరకు కాఫీ అందాల నగైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదిగో అచ్చం ఇక్కడ కనిపిస్తున్న ఆభరణాల్లా ఉంటుంది. అరకు లోయలోని పచ్చని కాఫీ తోటలు, అమాయక శ్రామికులు, గ్రామీణ జీవనశైలి… వీటన్నిటి స్ఫూర్తితో ప్రముఖ నగల డిజైనర్ సుహానీ పరేఖ్ రూపొందించిన ఈ నగలు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ఆంధ్రాలోని అరకు లోయ అంటేనే అందం. అక్కడి ప్రకృతి ఎంత ప్రత్యేకమో సువాసనలు వెదజల్లే కాఫీ తోటలూ అంతే వైవిధ్యం. బంగాళాఖాతం ఒడ్డున తూర్పు కనుమల్లో దాదాపు మూడువేల అడుగుల ఎత్తులోని తోటల్లో పండే అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది. ఆ కాఫీ గింజలు మొగ్గ వేసిన దగ్గరి నుంచి గింజగా మారే దాకా మొత్తం ప్రక్రియ ఆదివాసీ మహిళల చేతుల మీదుగానే నడుస్తుంది. దీన్నంతా నిశితంగా గమనించారు ముంబైకి చెందిన నగల డిజైనర్ సుహానీ పరేఖ్. అక్కడ తనకు తారసపడిన గిరిజనుల స్ఫూర్తితో ‘అరకు కలెక్షన్’ పేరిట నలభై డిజైన్లలో నగలను రూపొందించారు. లండన్‌లోని గోల్డ్‌స్మిత్ యూనివర్సిటీ నుంచి ఫైన్ఆర్ట్స్లో పట్టా పొందిన సుహానీ, ఆ తర్వాత భారత్ వచ్చి ‘మిషో’ అనే డిజైనర్ నగల తయారీ సంస్థను ప్రారంభించారు. కాఫీ తోటల స్ఫూర్తితో తయారు చేసిన నగల్ని ‘అరకు’ పేరిట తన కంపెనీ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు.

గూడెం గుండె చప్పుడు..
ఆదివాసీ స్త్రీల కట్టూబొట్టు, శ్రమైక జీవన సౌందర్యం, కాఫీ గింజలు, సంప్రదాయ నగలు… ఇవన్నీ తన ఆభరణాలకు స్ఫూర్తినిచ్చాయని అంటారు సుహానీ. ఈ నగల్లో చెవిపోగులు,
నెక్లెస్‌లు, గొలుసులు, చోకర్లు, ఉంగరాలు, బ్రేస్లెట్లు… ఇలా రకరకాలు ఉన్నాయి. ఆదివాసీలు పెట్టుకునే బంగారు గుళ్ల ముక్కెర ఆధారంగా భుజాల దాకా వేలాడే చెవి పోగులను తయారు చేశారు. బంగారం మీద చెక్కుళ్లు ఉన్న ముక్కెర నమూనాలో అర్ధ చంద్రాకారంగా కమ్మలను రూపొందించారు. ఇక లైట్‌వెయిట్ పట్టీలను అనుకరిస్తూ చోకర్ డిజైన్ చేశారు. కాఫీ గింజలను పోలిన లాకెట్లు, లోలాకుల కలెక్షన్లూ ఉన్నాయి. మనకిష్టమైన కాఫీకి, అంతకంటే ఇష్టమైన నగలకు జత కుదరడం విశేషమే!

Read More :
అతివలు అంతగా ఇష్టపడి ధరించే ఆమ్రపాలి నగల స్పెషాలిటీ ఏంటి?”
“One Gram Gold Jewellery | వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చేయించుకోండి!!”
Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్”
హైదరాబాదీ కళలను ఆకట్టుకుంటున్న ఈ అరబిక్ డిజైన్స్ గురించి తెలుసా”
Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

