Mother of Pearl Jewellery | వజ్రాలను మరిపించేలా మెరిసే ఆల్చిప్ప ఆభరణాల గురించి తెలుసా !!
Mother of Pearl Jewellery | ఆల్చిప్పకేం తక్కువ.. ముత్యాలను తలపించే రంగు, వజ్రాలను మరిపించే మెరుపు, బంగారంతో పోటీపడే సౌకుమార్యం! కాబట్టే, నగల తయారీలో ఆల్చిప్పను భాగం చేస్తున్నారు జువెలరీ డిజైనర్లు.

రత్నాలెన్ని ఉన్నా చందమామలా మెరిసే ముత్యమే ప్రత్యేకం. ఆ ముత్యానికి రూపునిచ్చే ఆల్చిప్పలు సైతం.. అందంలో బిడ్డకు దీటైన తల్లులే. ముత్యపు పైపొర మాదిరిగానే ఇవీ పంచవన్నెల్లో తళుకులీనుతుంటాయి. అందుకే రత్నాలతో సమానంగా చూస్తారు జెమాలజిస్టులు.

పూర్వకాలంలో రకరకాల ఆభరణాల తయారీలో, నగల పెట్టెల రూపకల్పనలో వీటిని వినియోగించారు. ఆధునికడిజైనర్లు మరింత సృజనను జోడిస్తూ.. ఆల్చిప్పలను గుదిగుచ్చి నఖశిఖాలంకరణకు నగలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ‘మదర్ ఆఫ్ పెరల్ జువెలరీ’ అందరినీ ఆకట్టుకుంటున్నది.

ప్రకృతిలో సహజంగా దొరికే ఆల్చిప్పలు పాలనురగ రంగులో మెరిసిపోతూ.. మగువలు అటూ ఇటూ కదిలినప్పుడు ఇంద్ర ధనుస్సు వర్ణాల్ని వెదజల్లుతాయి. గులాబీ, ఆకుపచ్చ, నలుపు, నీలం రంగుల ఆల్చిప్పలూ ఉంటాయి.

వీటితో నెక్లెస్‌లు, గొలుసులు, లాకెట్లు, జుంకాలు, చెవి దుద్దులు, బ్రేస్లెట్లు, ఉంగరాల్లాంటివీ చేస్తున్నారు. గడియారాల తయారీ కంపెనీలు వాచీలోని డయల్ భాగాన్ని మదర్ ఆఫ్పెరల్తోనే రూపొందిస్తున్నాయి.

నవరత్నాల్లో ఒక్కో రత్నానికి ఓ ప్రత్యేకత ఉన్నట్టు, ఆల్చిప్పలకూ కొన్ని అరుదైన గుణాలున్నాయి. ఇవి నెగెటివ్ ఎనర్జీని దూరంచేసి, మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తాయని నమ్ముతారు. అందుకే విదేశాల్లోనూ పెండెంట్లు, ఉంగరాల రూపంలో వీటిని ఇష్టంగా ధరిస్తారు.

Read More :
“Choker Necklace | ఒకప్పటి కాసుల పేరు ఈ తరం అమ్మాయిల ఫేవరేట్‌గా మారిపోయింది”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

