Fashion | కరకరలాడే 50-50 బిస్కెట్లలా హాఫ్ అండ్ హాఫ్ ట్రెండ్
Half and Half Fashion | సిరివెన్నెల ఎంత తెల్లగా ఉన్నా చీకటి పక్కన ఉంటేనే దాని సోకు! హరివిల్లులో ఎన్ని రంగులున్నా నీలాకాశం మెరుస్తుంటేనే దాని సొంపు! ఆకుపచ్చని నేల, అందాల ఆకాశం ఎంత పెద్దవైనా దూరపు ఒడ్డున రెండూ సగంసగమే. ప్రకృతి అందాలు పరిపూర్ణం కావడానికే మరో సగం కావాల్సి వచ్చినప్పుడు, ఫ్యాషన్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందా! అందుకే, కరకరలాడే 50-50 బిస్కెట్లలా హాఫ్ అండ్ హాఫ్ ట్రెండ్‌ను తీసుకువచ్చింది. రెండు రంగుల కలబోతగా వస్తున్న ఈ ఫ్యాషన్ ఇప్పుడు డబుల్ధమాకాలా ఊరిస్తున్నది.

రాముకు తెలుపు రంగు చొక్కా నచ్చింది. రమణకి నీలం పూల షర్టు ట్రెండీగా అనిపించింది. రెండూ బాగున్నాయి. కానీ ఏది ఎంచుకోవాలన్నది రమేష్ సమస్య. అందుకే ఈ రెండిటి కలబోతగా తయారైన హాఫ్ అండ్ హాఫ్ చొక్కా తీసుకున్నాడు. అటు క్లాసీ, ఇటు ట్రెండీ. ఆలోచన అదిరింది కదూ! ఒక్క రమేష్‌కే కాదు ఏ రంగు తీసుకోవాలో తేల్చుకోలేని అమ్మాయిలకూ, నగల్లో రెండు డిజైన్లూ నచ్చిన అతివలకూ 50-50 ఫ్యాషన్ ఓ వరం.

నచ్చిన రెండు రంగుల్నీ ఒకేసారి వేసుకోవడం, మెచ్చిన రెండు మోడళ్లనూ ఒకేసారి పెట్టుకోవడం ఎవరికైనా ఆనందమేగా మరి! అందుకే ఆడామగా అని తేడా లేకుండా ప్యాంట్లు, చొక్కాలు, షార్ట్స్, టీషర్టులు, కుర్తీలు, బ్యాగులు.. ఇలా అన్నిటిలోనూ ఈ ట్రెండ్ రాజ్యమేలుతున్నది. దుస్తులు, యాక్సెసరీలనే కాదు మగువలు మెచ్చే నగలలోనూ దీని వగలు కనిపిస్తున్నాయి. నెక్లెస్‌లు, గాజులు, బ్రేస్లెట్లు, ఉంగరాలు… అన్నింటిలోనూ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లు వారెవ్వా అనిపిస్తున్నాయి. రెండు విభిన్న డిజైన్లు ఒకచోట చేరడంతో చూడగానే కొత్తగా కనిపిస్తున్నాయి.

ఇక చొక్కాలూ, టాపులైతే.. బ్లాక్ అండ్ వైట్లా పర్ఫెక్ట్ మ్యాచింగ్ మొదలు పసుపు నీలాల్లా పక్కా విరుద్ధమైన రంగుల దాకా విభిన్న వర్ణాల జోడీలుగా రూపొందుతున్నాయి. ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో ఫొటో పోస్ట్ చేయాలంటే రెండు సెల్ఫీలు దిగొచ్చు. రెండు చొక్కాల్లో దిగినట్టు పోజు కొట్టొచ్చు. మొత్తానికి ఫ్యాషన్ ప్రపంచంలో ఈ హాఫ్ ఫ్యాషన్ ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నదన్నమాట. ఫిఫ్టీ.. ఫిఫ్టీ!

Read More :
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

