Double Denim Fashion | ఫ్యాషన్ ప్రపంచం కుదురుగా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వచ్చి ఫిట్‌గా సెటిలవుతూ ఉంటాయి. ఈ కోవకే చెందుతుంది ‘డబుల్ డెనిమ్’ ఫ్యాషన్. డెనిమ్ జీన్స్ కంఫర్ట్‌తోపాటు రిచ్‌లుక్‌ను అందిస్తాయి. సాధారణంగా డెనిమ్ ట్రౌజర్స్ ధరించినప్పుడు కాంబినేషన్‌గా టీషర్ట్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తారు చాలామంది. కాస్త కొత్త లుక్ కావాలనుకునేవారు వదులుగా ఉండే టాప్స్ ఎంచుకుంటారు.
ఇప్పుడు టాప్ టు బాటమ్ డెనిమ్ ధరించడం ట్రెండ్ అయింది. భళారే అనిపించే నీలి డెనిమ్ జీన్స్, షార్ట్, లెగ్గిన్పైకి డెనిమ్ టాప్లనే ధరిస్తున్నారు. డెనిమ్ వెరైటీ స్కర్ట్లనూ ఏరికోరి కొనుగోలు చేస్తున్నారు. సెలెబ్రిటీ ఫ్యాషన్‌గా మొదలైన ఈ ట్రెండ్‌కు యంగిస్థాన్ ఓటేస్తున్నది. రానున్న వర్షకాలంలోనూ డెనిమ్ దుస్తులు కంఫర్టబుల్‌గా ఉంటాయంటున్నారు ఫ్యాషన్ గురూజీలు.
Chiffon Fabric | సమ్మర్లో కంఫర్ట్‌గా.. ట్రెండీగా కనిపించే ఈ డిజైన్లు తెలుసా”
పోనీటెయిల్ రోజూ ఒకేలా వేసుకుని బోర్ కొడుతున్నదా? ఇలా ట్రై చేయండి”
“Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..”
“Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”