Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..
Neon Yellow | పసుపు పచ్చ రంగు కనిపించగానే మనసు ప్రశాంతం అవుతుంది. మనలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఆ సకారాత్మక శక్తిని అలంకరణలోనూ భాగం చేసుకోవచ్చు. చీరలు, కుర్తాల నుంచి చెవి కమ్మల దాకా అన్నిట్లోనూ జొప్పించవచ్చు. పసుపులందు నియాన్ పసుపు వేరయా.. అన్నట్టు ‘నియాన్ ఎల్లో’ ఇటీవలే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
పసుపు రంగే కళ్లను కట్టిపడేస్తుందని అనుకుంటే.. నియాన్ పసుపు ఎదుటివాళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తుంది. అందులోనూ ఈ వేసవిలో నియాన్ ఎల్లో ట్రెండింగ్‌లో ఉంది. వేసవి మొదలు కాగానే సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అంతా టూర్లకు వెళ్లడం ప్రారంభిస్తారు. పెండ్లిళ్లు, పేరంటాలకు కొత్త బట్టలు కొంటారు. పిల్లలతో సరదాగా ఏ రిసార్ట్కో బయల్దేరతారు. ఆ సమయంలో ఆడాలి, పాడాలి, డ్యాన్స్ చేయాలి. అంత ఎనర్జీ రావాలంటే.. కిక్ ఇచ్చే ఓ కలర్ కావాలి. అదే.. నియాన్ ఎల్లో!
ఇటీవల ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కియారా అద్వానీ మొదలైన బాలీవుడ్ భామలంతా నియాన్ ఎల్లో డ్రెస్సుల్లో ముస్తాబై హాట్‌హాట్ సమ్మర్‌ను బ్రైట్ బ్రైట్‌గా మార్చేశారు. ఫ్యాషన్ షోలలో మోడల్స్ ఈ రంగుకే ఓటేస్తున్నారు. నియాన్ ఎల్లో దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఇంతవరకూ నియోన్ పసుపును ప్రయత్నించనివారు సైతం పచ్చగా ముస్తాబు కావచ్చు.
ఎటుచూసినా..
హ్యాండ్‌బ్యాగ్, హెయిర్‌బ్యాండ్, చెప్పులు.. ఇలా మహిళల ముస్తాబులో భాగమైన ప్రతి వస్తువూ నియాన్ ఎల్లోలో మెరిసిపోతున్నది. ఇదేం ‘లేడీస్ ఓన్లీ’ రంగు కాదు. పురుషులు కూడా ఈ రంగును నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. షర్ట్, కుర్తా ఏదైనా.. అదిరిపోతుంది. జీన్స్ మీదికి కూడా సూటవుతుంది. బ్యాచిలర్ పార్టీలకు ముదురు బ్రహ్మచారులకు అతికినట్టు సరిపోతుంది. నలుపు, తెలుపు, యాపిల్ మెరుపు.. ఏ రంగువాళ్లకయినా ఈ కలర్ సూట్ అవుతుంది. ఎంత అందమైన దుస్తులు ధరించినా ఆభరణాలు లేకపోతే తేలిపోతారు. కాబట్టి, నియాన్ ఎల్ల్లో రంగులతో ఆభరణాలూ వస్తున్నాయి. ఉంగరాలు, బ్రేస్లెట్లు భేషుగ్గా డిజైన్ చేస్తున్నారు. మరి, నెయిల్ పాలిష్ అంటారా? అదీ సిద్ధమే! ఆలస్యమెందుకు? నెక్ట్స్ వీకెండ్‌కు నియాన్ ఎల్లోలో మెరిసిపోండి!
Read More :
ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది? ఒక్కో కలర్‌తో ఒక్కో లాభం.. అవేంటో తెలుసా?
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు స్టార్టప్స్.. సైడ్ బిజినెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ స్టార్స్..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- fashion
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

