ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది? ఒక్కో కలర్‌తో ఒక్కో లాభం.. అవేంటో తెలుసా?
Colors | ‘ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు..’ అన్నాడో కవి. అందాలే కాదు, ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది! తెలుపు రంగు స్వచ్ఛతను, తొగరు రంగు పొగరును.. ఇలా వన్నె వన్నెలో ఎన్నో చిన్నెలు దాగి ఉన్నాయి. రంగులలో కల ఫ్యాషన్ కళను వర్ణాల వారీగా ఆరాధించే ఆస్వాదకులూ ఉంటారు. రోజుకో రకం రంగు దుస్తులు ధరించే వాళ్లూ తారసపడుతుంటారు. వివిధ రంగులు, అవి చేసే హంగుల గురించి తెలుసుకుంటే, మీ ఫ్యాషన్ తంత్రానికి రంగుల మంత్రం వేసేస్తారు.
నీలిరంగు
అంతులేని ఆకాశం, లోతు తెలియని సముద్రం ఈ రెండిటి రంగు నీలమే! నీలిరంగు దుస్తులు ధరించిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అంతేకాదు నీలిరంగు హుందాతనానికి, స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
తెలుపు
ఈ రంగు దుస్తులు ప్రశాంతంగా ఉంచుతాయి. కొత్తదనాన్ని ఆహ్వానించే మనోస్థయిర్యాన్ని ఇస్తాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనసులోని ఆందోళనలు దూరం అవుతాయి.
ఆకుపచ్చ
ఈ రంగును అదృష్టం, ప్రకృతి, సంరక్షణకు చిహ్నాలుగా భావిస్తారు. ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే సకల విజయాలు కలుగుతాయని నమ్మకం. అలాగే చేసే పనిలో పరిపూర్ణంగా నిమగ్నం అవుతారు. ఈ రంగు బోలెడంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కొత్త వ్యక్తులను మొదటిసారి కలిసేటప్పుడు ఆకు
పచ్చరంగు దుస్తులు ధరిస్తే మనసులోని ఆందోళనలు దూరమవుతాయి. బంధం బలపడుతుంది.
నారింజ
నారింజ పండును చూస్తే నోరూరుతుంది. ఆ రంగు దుస్తులు ధరిస్తే మనసుకు సంతోషం చేకూరుతుంది. పదిమందితో కలిసిపోయే వాళ్లు ఈ రంగును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తెలియని వాళ్ల మధ్య ఉన్నా, ఎప్పుడూ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు నారింజ రంగు దోహదపడుతుంది.
గులాబి రంగు
కరుణ, జాలి, మృదుత్వానికి సూచిక గులాబి రంగు. ఈ వర్ణం దృఢత్వానికి ప్రతీక కూడా. తాజాదనాన్ని సైతం సూచిస్తుంది. ఆత్మీయ వేడుకలకు ఈ రంగు భలేగా నప్పుతుంది. గతం తాలూకు చింతలేవీ గుర్తురాకుండా చేస్తుంది. నాయకత్వ లక్షణానికి కూడా ప్రతీకగా భావిస్తారు.
పసుపు
పసుపు డ్రెస్ వేసుకున్న వ్యక్తులు ఆ రోజు ఏదో పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తారట. అందుకే ప్రత్యేక సందర్భాల్లో పసుపు వన్నె దుస్తులు ఎంచుకుంటే మంచిది. పసుపు వర్ణం దుస్తులు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి దోహదం చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎరుపు
చెంగావి రంగు.. చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా చూసేవాళ్లకు అందమంతా ఆ రంగులోనే ఉందనిపిస్తుంది. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే రంగు ఎరుపు. అందుకే ఈ రంగు మనిషి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. కోపం, ప్రేమ, తెగువ.. మనిషిలోని భిన్న స్వభావాలకు ప్రతీకగా చెబుతారు.
నలుపు
అశుభానికి ప్రతీకగా నలుపును భావిస్తారు. కానీ, ఫ్యాషన్ ప్రపంచంలో నలుపుది ప్రత్యేక స్థానం. నలుపు మనిషి మానసిక స్థయిర్యాన్ని పెంచుతుంది. నలుపును నిరసనకు చిహ్నంగా భావిస్తారు. నలుగురు కలిసి పనిచేసే చోట నలుపు యూనిఫామ్‌గా ఉంటే, వాళ్లంతా చురుగ్గా పనిచేస్తారని ఓ విశ్లేషణ.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!
వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!
ఇప్పుడు బ్రేకప్‌లకు కూడా పార్టీలు.. చిత్రవిచిత్రంగా నవతరం జంటల విడాకుల ఫంక్షన్లు
రతన్ టాటా భుజాలపై చేయి వేసి మరీ మాట్లాడగలిగే ఈ వ్యక్తి గురించి తెలుసా
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- colors
- Colours
- lifestyle
- nt special
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

