ఇప్పుడు బ్రేకప్‌లకు కూడా పార్టీలు.. చిత్రవిచిత్రంగా నవతరం జంటల విడాకుల ఫంక్షన్లు

ఇప్పుడు, బ్రేకప్ ( Breakup ) ఓ పెద్ద వేడుక. విడాకులకు కూడా గుమ్మానికి మామిడాకులు కడుతున్నారు. ‘బ్రేకప్ మహోత్సవ ఆహ్వాన పత్రిక’ అంటూ బంధుమిత్రులకు ఇన్విటేషన్లు పంచుతున్నారు. ఘనంగా స్టార్ హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. ఎంత ఖర్చయినా.. తగ్గేదే లే!
హాట్‌స్టార్‌లో సూపర్ రేటింగ్స్ సాధిస్తున్న ‘డీకపుల్డ్’ వెబ్ సీరిస్ చూస్తున్నప్పుడు.. ఇదేదో బావుందే మరి అనిపిస్తుంది. మాధవన్ ఇందులో కథానాయకుడు. భార్యాభర్తలు విడిపోవాలని అనుకుంటారు. ఆ వేడుక కోసం బంధుమిత్ర సపరివార సమేతంగా ఆత్మీయులను గోవాకు ఆహ్వానిస్తారు. ఆ కార్యక్రమం కూడా వింతగానే ఉంటుంది. నవతరం జంటలు విడాకుల వేడుకలను చిత్ర విచిత్రంగా జరుపుకొంటున్నాయి.

థీమ్ 1
జీవితమంతా మూడు ఉంగరాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి.. ఎంగేజ్మెంట్ రింగ్, రెండు మ్యారేజ్ రింగ్, మూడు సఫరింగ్! ఇక మిగిలింది.. ‘మనం ఎంచక్కా విడిపోదామా’ అంటూ జీవిత భాగస్వామికి ఇచ్చే సెల్‌ఫోన్ రింగ్! బ్రేకప్ వేడుకలో దంపతులు.. తమ పెండ్లి రింగ్‌ను తీసి.. తమ (తాజా మాజీ) జీవిత భాగస్వామి మీదికి విసురుతారు. అవతలి వ్యక్తి పట్టేసుకోగానే… జనం ‘సూపర్ క్యాచ్’ అని అరిచేస్తారు. అంతే, తంతు ముగిసినట్టే.
థీమ్ 2
ధర్మేచ, అర్థేచ, కామేచ నాతి చరామి – అంటూ ప్రమాణం చేసి.. సవ్య దిశలో అగ్ని చుట్టూ ఏడడుగులు నడవటం సంప్రదాయం. కానీ, బ్రేకప్ వేడుకలో ‘ధర్మేచ, అర్థేచ, కామేచ.. నాతి నచరామి’ అంటాడు పురుషుడు. అస్తు, అస్తు అంటూ అతిథులు మంత్రాక్షతలు చల్లుతారు. ఆ తర్వాత, అపసవ్య దిశలో ఏడడుగులు వేస్తారు ఇద్దరూ!

థీమ్ 3
వేడుకలో భాగంగా.. ఓ పెద్ద మనిషి వేదిక మీదికి వస్తాడు. ఒక్కొక్కరినీ పిలిచి.. ‘మీ నిర్ణయాన్ని మార్చుకుంటారా?’ అని అడుగుతాడు. ఒకసారి కాదు.. మూడు సార్లు! ఏ ఒక్కరి నుంచి అయినా ‘అవును’ అన్న సమాధానం వస్తే.. ఏకాంతంగా చర్చించుకునే అవకాశం ఇస్తాడు. లేకపోతే, సాయంకాలపు విందు సమయంలో చలిమంట లాంటిది ఏర్పాటుచేస్తారు. ఇద్దరూ కలిసి పెండ్లి ఫొటోలు, పెండ్లి బట్టలు తగలబెట్టేస్తారు.
థీమ్ 4
కొన్ని బ్రేకప్ వేడుకల్లో విడిపోనున్న జంట వేదిక మీద నిలబడి ఇలా ప్రమాణం చేస్తుంది.. ‘ఇప్పటిదాకా మనం జీవిత భాగస్వాములం. కష్టం సుఖం కలిసి పంచుకున్నాం. కారణం ఏమైతేనేం విడిపోయాం. ఈ క్షణం నుంచీ గతాన్ని మరచిపోదాం. మంచి స్నేహితుల్లా ఉందాం. బాధ్యత కలిగిన తల్లిదండ్రులం అన్న సంగతి సదా గుర్తుచేసుకుందాం’. చివరి వాక్యం పూర్తికాగానే చప్పట్లు మిన్నంటుతాయి. చివరిముద్దు ఇచ్చిపుచ్చుకుంటారు. తుది వీడ్కోలు తీసుకుంటూ
ఆలింగనం చేసుకుంటారు. ఒకరి కన్నీళ్లు ఒకరు (వస్తే గిస్తే) తుడుచుకుంటారు.
(అ)శుభం!
జీవితం ఓ బస్సు ప్రయాణం. మన పక్కసీటులో ఎవరో కూర్చుంటారు. ఎక్కడో దిగిపోతారు. మళ్లీ ఇంకెవరో సహ ప్రయాణికులు అవుతారు. వివాహ వ్యవస్థ కూడా అందుకు మినహాయింపు కాదన్నది బ్రేకప్ పండితుల ఉవాచ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Katrina kaif | పెళ్లి, విడాకులపై కత్రినా కైఫ్ ఒపీనియన్ ఏంటో తెలుసా
భార్యకు విడాకులు ఇవ్వవచ్చు.. పిల్లలకు ఇవ్వలేరు..!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

