భార్యకు విడాకులు ఇవ్వవచ్చు.. పిల్లలకు ఇవ్వలేరు..!
Supreme court: ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ, పిల్లలకు ఇవ్వలేడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2019లో జరిగిన ఓ విడాకుల కేసులో విచారణ సందర్భంగా
ఓ కేసులో ఆభరణాల వ్యాపారికి సుప్రీంకోర్టు చురక

న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ, పిల్లలకు ఇవ్వలేడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2019లో జరిగిన ఓ విడాకుల కేసులో విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 2019లో ముంబైకి చెందిన ఓ ఆభరణాల వ్యాపారి, ఆయన భార్య పరస్పర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు తల్లితోనే ఉండాలని, వారి సంరక్షణ కోసం తండ్రి రూ.4 కోట్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు.
అయితే, 2019లోనే సదరు వ్యాపారి తన భార్యకు రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఇవ్వలేదు. దాంతో అతని భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపింది. పిల్లల సంరక్షణ కోసం తక్షణమే రూ.4 కోట్లు చెల్లించాలని వ్యాపారిని ఆదేశించింది. కరోనావల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తన క్లయింట్ రూ.4 కోట్ల పరిహారం చెల్లించలేకపోయాడని, ఇప్పటికీ పరిస్థితి సరిగా లేనందున మరికొంత సమయం ఇవ్వాలని వ్యాపారి తరఫు న్యాయవాది కోర్టును కోరాడు.
కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం అందుకు నిరాకరించింది. కడుపున పుట్టిన పిల్లల సంరక్షణను తండ్రి చూసుకోవాల్సిందేనని, మైనర్ పిల్లల పోషణ నిమిత్తం ఒప్పందం మేరకు రూ.4 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. భార్యకు విడాకులు ఇవ్వవచ్చుగానీ, పిల్లలకు ఇవ్వలేరని వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 1న రూ.కోటి, అదే నెల 30న మిగిలిన రూ.3 కోట్లు పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం కక్షిదారులు పరస్పరం దాఖలు చేసుకున్న కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

