Pamela Anderson | ఐదోసారి విడాకులకు సిద్ధమైన నటి.. లాక్డౌన్లో బాడీగార్డ్‌తో పెండ్లి.. ఇప్పుడు తెగదెంపులు

Pamela Anderson Divorce | సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు కామన్ అయిపోతున్నాయి. గత ఏడాది సమంత, నాగచైతన్య జంట విడిపోయి షాకిచ్చారు. బాలీవుడ్లో ఆమీర్‌ఖాన్-కిరణ్‌రావు జంట కూడా తమ 15 ఏండ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తన భార్య, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడిపోయాడు. ఈ వార్త సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరో నటి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? హాలీవుడ్ నటి పమేలా అండర్సన్. ఈమె ఒకటి.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఐదో భర్తతో కూడా తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తుంది.
పమేలా అండర్సన్ తొలిసారిగా 1995లో టామీ లీ అనే అమెరికన్ నటుడిని పెండ్లి చేసుకుంది. కానీ పెండ్లయిన మూడేండ్లకే అతని నుంచి విడిపోయింది. వీరిద్దరికీ బ్రాండన్, డైలాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత 2006లో సింగర్ కిడ్ రాక్‌ను పెళ్లాడింది. వీరిద్దరూ దాదాపు ఏడాది మాత్రమే కలిసి ఉన్నారు. ఇక 2014లో అమెరికన్ పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ బంధం కూడా ఏడాది కంటే ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇక నాలుగోసారి ప్రొడ్యూసర్ జాన్ పీటర్స్‌ను 2020లో సీక్రెట్‌గా మ్యారేజి చేసుకుని కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో తన బాడీగార్డ్ డాన్ హేహర్ట్స్కు దగ్గరైంది. అతనితో ప్రేమలో పడింది. లాక్డౌన్లో ఈ ఇద్దరూ పెండ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఈ బంధం కూడా ఎక్కువరోజులు నిలబడట్లేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR New release date | ట్రిపుల్ ఆర్ నుంచి సర్ప్రైజ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనంట!!
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
Vijay devarakonda | లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఇవే..
Kiran Abbavaram | ఆ కుర్రాడిలో విషయం ఉంది.. దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- divorce
- pamela anderson
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

