Vijay devarakonda | లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఇవే..

Vijay devarakonda | కెరీర్ మొదట్లో వరుస సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ.. గత రెండేళ్లుగా పూర్తిగా జోరు తగ్గించాడు. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడంతో.. మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగుతో పాటు ఒకేసారి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డు తో పని లేకుండా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు.
ఒకేసారి హిందీ, తెలుగులో సినిమా షూట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. మిగిలిన భాషల్లో దీనిని డబ్బింగ్ చేయనున్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇదంతా ఇలా ఉంటే పూరీ జగన్నాథ్ సినిమా తర్వాత విజయ్ ఎవరితో సినిమాలు చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అలాంటి మాస్ యాక్షన్ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ టాలీవుడ్ దర్శకులతో పని చేస్తాడా లేదా అనేది అనుమానమే. అయితే లైగర్ తర్వాత కూడా విజయ్ ప్లానింగ్ సూపర్‌గా ఉంది.
2022 లో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయంపై ఈ మధ్యే ఓ క్లారిటీ వచ్చింది. సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ తమ కాంబినేషన్లో సినిమాను అధికారికంగా ప్రకటించాడు. సుకుమార్ తర్వాత మజిలీ, నిన్ను కోరి సినిమాల దర్శకుడు శివ నిర్వాణతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. నానితో చేసిన టక్ జగదీశ్ అంచనాలు అందకపోవడంతో శివ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. తమ కాంబినేషన్లో సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చాడు శివ నిర్వాణ. మొత్తానికి పూరీ తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ సిద్ధం చేసుకున్నాడు రౌడీ హీరో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?
Vijay Devarakonda | ‘పుష్ప-3’ కూడా ఉందా?.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్
Sara Ali Khan | సారా అలీఖాన్‌కు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉందో తెలుసా..?
నిర్మాత ఏమైపోయినా విజయ్ దేవరకొండ పట్టించుకోడు.. అభిషేక్ నామా సంచలనం..
లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

