లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?

Vijay devarakonda remuneration | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫోకస్ మొత్తం లైగర్ సినిమాపైనే ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని కలలు కంటున్నాడు. అందుకే ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ చూస్తుంటే ఆ విషయం అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు లైగర్ చిత్రానికి విజయ్‌దేవరకొండ తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.
లైగర్ చిత్రానికి విజయ్ దేవరకొండ రూ.20 కోట్ల వరకు పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్‌తో పాటు సినిమా షేర్లో కొంత వాటా కూడా విజయ్ దేవరకొండకు అందుతున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే టైర్ 2 హీరోలలో అత్యధిక పారితోషకం అందుకుంటున్నది విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్‌లోనూ విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది. లైగర్ సినిమా బాలీవుడ్‌లోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే దర్శక నిర్మాతలు కూడా విజయ్ రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడలేదని సమాచారం. కాగా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ,గీతా గోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ల ను రాబట్టాయి. ఇక విజయ్ తన తదుపరి సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన పూరీ జగన్నాథ్ కూడా ఈ సినిమాతో తన రేంజ్ చూపించాలని అనుకుంటున్నాడు. అందుకే ఛార్మితో కలిసి ఈ సినిమాను సొంతంగా పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్లో బడా నిర్మాతగా పేరున్న కరణ్ జోహర్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాత కావడం విశేషం. ఇక లైగర్ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Vijay Devarakonda | ‘పుష్ప-3’ కూడా ఉందా?.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్
Rashmika Vijay | సేమ్ లొకేషన్లో రష్మిక, విజయ్..సీక్రెట్ ట్రిప్ వేశారా..?
లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..
Sara Ali Khan | సారా అలీఖాన్‌కు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

