లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..

Liger vijay devarakonda | తెలుగు ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్‌కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఒక రకమైన వ్యసనం. ఒక్కసారి పూరీతో వర్క్ చేశారు అంటే కచ్చితంగా ఆయనతో ప్రేమలో పడిపోతారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూరీతో స్నేహం కొనసాగుతోంది. అలా మాయ చేస్తాడు ఈ డైరెక్టర్. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ సినిమా భారీగా ప్లాన్ చేస్తున్నాడు పూరీ. కొడితే దెబ్బకు ఇండియా షేక్ అయిపోవాలి అంటున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన లైగర్ టీజర్ రికార్డులు కొల్లగొడుతుంది. ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విజయ్ దేవరకొండకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారంతా.

లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. ఇదిలా ఉంటే లైగర్ సినిమా షూటింగ్ సమయంలోనే పూరీతో మరోసారి వర్క్ చేయాలని విజయ్ దేవరకొండ ఫిక్స్ అయిపోయాడు. పూరీ కూడా ఇదే ఫీల్ అవుతున్నాడు. తన కోసం రెండేళ్లకు పైగా డేట్స్ ఇచ్చిన విజయ్‌తో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. లైగర్ ఫలితంతో సంబంధం లేకుండా వెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడం దాదాపు ఖాయం అయిపోయింది. గతంలో ప్రభాస్ తో కూడా బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వరుసగా చేశాడు పూరీ జగన్నాథ్. అన్నట్లు లైగర్ సినిమా దాదాపు 150 కోట్ల బిజినెస్ చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుత మార్కెట్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఈ సినిమా కాని హిట్ అయ్యింది అంటే బాలీవుడ్లో కూడా విజయ్ జెండా పాతడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
Sara Ali Khan | సారా అలీఖాన్‌కు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉందో తెలుసా..?
నిర్మాత ఏమైపోయినా విజయ్ దేవరకొండ పట్టించుకోడు.. అభిషేక్ నామా సంచలనం..
స్లమ్‌డాగ్.. ఛాయ్‌వాలా.. గర్జించిన దేవరకొండ.. లైగర్ టీజర్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

