నిర్మాత ఏమైపోయినా విజయ్ దేవరకొండ పట్టించుకోడు.. అభిషేక్ నామా సంచలనం..

abhishek nama sensational comments on vijay devarakonda | తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చేసింది. తక్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ ఇమేజ్, మార్కెట్ సొంతం చేసుకున్నాడు విజయ్. కెరీర్ మొదట్లో ఆయన ఎంపిక చేసుకున్న కథలు అతడిని స్టార్ గా మార్చేశాయి. చాలా తక్కువ సమయంలోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సంచలన విజయాలు అందుకుని స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అతడితో సినిమా చేయడానికి అగ్ర నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు. మీడియం బడ్జెట్ సినిమాలకు బంగారు బాతులా మారిపోయాడు ఈయన. అలాంటి సంచలన హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా.
అభిషేక్ పిక్చర్స్ పై ఎన్నో సినిమాలు ఈయన డిస్ట్రిబ్యూట్ చేశాడు అభిషేక్ నామ. ఈయన గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా ఆయనకు అంత మంచి పేరు ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. క్రాంతి మాధవ్ తెరకెక్కిన ఈ సినిమాను సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మించారు. మంచి అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. నిర్మాతలకు, బయ్యర్లకు కూడా ఈ సినిమా ఎన్నో కోట్ల నష్టం తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రవర్తించిన తీరు తనకు అస్సలు నచ్చలేదు అంటున్నాడు అభిషేక్ నామా.
తాను చేసిన అన్ని సినిమాల్లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నాడు అభిషేక్. ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత విజయ్ దేవరకొండకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడని.. కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు అంటూ సంచలన కామెంట్ చేశాడు. అలాంటి హీరోతో మరోసారి కలిసి పని చేయాలంటే మనసు రాదు అంటున్నాడు అభిషేక్ నామా. డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.. నష్టపోయిన నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు హీరో కచ్చితంగా అండగా నిలబడాలి.. ఆ మాత్రం భరోసా ఇవ్వకపోతే అతను హీరో అవ్వలేడు అంటున్నాడు అభిషేక్. మొత్తానికి ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika: విజయ్ దేవరకొండని కలిసేందుకు యూఎస్ వెళుతున్నావా రష్మిక..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
అన్నయ్య చెప్పింది అదొక్కటే.. విజయ్ దేవరకొండపై ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది.. బాంబ్ పేల్చిన విజయ్‌దేవరకొండ..!!
ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండడా? సుకుమార్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

