వెండితెర స్టార్‌జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక.. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి రావడమే వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ తమకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అయింది. ‘గీత గోవిందం’ సినిమాలో తమ లిప్ లాకుల్లో ఉన్న మజా ఎలా ఉంటుందనేది చూపించి ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ మూవీలో అదే లెవల్ కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు.
రష్మిక .. విజయ్‌ని కలిసేందుకు యూఎస్ వెళుతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా తన పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. ఒక ఫొటోకి .. ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్నా.. నేను త్వరలో తిరిగి వస్తాను అని రాసింది.
దీనిపై నెటిజన్స్ భిన్న రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్ యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటుండగా, అక్కడ అతడిని కలిసేందుకు రష్మిక వెళ్లిందని అంటున్నారు. మరోవైపు రష్మిక ‘లైగర్’ లో గెస్ట్ రోల్ లో కన్పించబోతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రష్మిక ప్రస్తుతం “పుష్ప” చిత్రంలో నటిస్తుంది. అలానే బాలీవుడ్లో “మిషన్ మజ్ను”, “గుడ్‌బై” సినిమాలు చేస్తోంది.