అన్నయ్య చెప్పింది అదొక్కటే.. విజయ్ దేవరకొండపై ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
vijay devarakonda and anand devarakonda | కొత్తదనం, వైవిధ్యత మేళవించిన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తానని అంటున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. గోవర్ధన్‌రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో ఆనంద్ దేవరకొండ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

కమల్‌హాసన్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు?
తొలుత ఈ సినిమాకు ‘పుష్పకవిమానం’తో పాటు చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ ఆ పేరు మాత్రమే మా కథకు కరెక్ట్ అనిపించింది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఫోన్ చేసి టైటిల్ వాడుకోవాలనుకుంటున్నామని చెప్పాం. కథకు సరిపోతే వాడుకోమని అభ్యంతరం లేదని ఆయన అన్నారు. పెళ్లి విషయంలో పెద్ద కలలున్న సంప్రదాయాలకు విలువనిచ్చే యువకుడిగా నేను ఈసినిమాలో కనిపిస్తా. తన ఊహలకు భిన్నంగా అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతడి పెళ్లి ప్రయాణాన్ని పుష్పకవిమానంతో పోలుస్తూ ఈ టైటిల్ పెట్టాం. పుష్పక్ ట్రావెల్స్ అనే పాయింట్ కథలో కీలకంగా ఉంటుంది.
దర్శకుడు చెప్పిన పాయింట్లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?
‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి విజయ్‌దేవరకొండకు దర్శకుడు దామోదరతో పరిచయముంది. ఆ సాన్నిహిత్యంతోనే అతడు మాకు ఈ కథ వినిపించాడు. మా బ్యానర్లో వేరే హీరోతో ఈ సినిమాను నిర్మించాలనుకున్నాం. ఇలాంటి భిన్నమైన పాత్రలో నటించడానికి హీరోలెవరూ ముందుకు రాలేదు. దాంతో నేనే కథానాయకుడిగా నటించాల్సివచ్చింది. పళ్లైన యువకుడిగా నన్ను ప్రేక్షకులు స్వీకరిస్తారా?లేదా అనే భయంతో తొలుత సినిమా చేయడానికి సంశయించా. క్యారెక్టర్‌పరంగా రిస్క్ ఉన్నా కథ నచ్చి సినిమా చేశా.
చాలెంజింగ్‌గా భావించి ఈ సినిమా చేశారా?మీ పాత్రలో ఎలాంటి సవాళ్లు ఉంటాయి?
చిట్టిలంక సుందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నేను ఈ సినిమాలో కనిపిస్తా. పళ్లైన వారం రోజుల తర్వాత అతడి భార్య కనిపించకుండాపోతుంది. ఆమె లేచిపోయిందనే వాస్తవాన్ని దాచడానికి అతడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. హీరో పాత్రకు ఎదురయ్యే ప్రస్ట్రేషన్ వినోదాన్ని పంచుతుంది. పెళ్లి ఔన్నత్యాన్ని చాటిచెప్పే చక్కటి సందేశంతో పాటు థ్రిల్, ఎమోషన్స్ ఉంటాయి.
కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి భిన్నమైన కథాంశంతో సినిమా చేయాలని ఎందుకనిపించింది?
నూతన దర్శకులందరూ వినూత్నమైన పాయింట్స్‌తో కథలను రాస్తున్నారు. కానీ అలాంటి కొత్త సినిమాలు చేసే హీరోలు దొరకడం లేదు. ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ లాంటి నాచురల్ సినిమాలు మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. కొత్తదనాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నప్పుడు నటులు కూడా ముందడుగు వేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ సినిమాను అంగీకరించా.

అన్నయ్య విజయ్‌దేవరకొండ ఈ సినిమాలో ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నారు?
రెండు నెలల క్రితం అన్నయ్య విజయ్ దేవరకొండ సినిమా చూశాడు. ఆయనకు చాలా నచ్చింది. నిర్మాత అనే బాధ్యత తనపై ఉండటంతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. నా కథలు, సినిమాల ఎంపికలో అన్నయ్య ఎక్కువగా జోక్యం చేసుకోడు. ఏది చేసినా ఒత్తిడి, టెన్షన్స్ లేకుండా సరదాగా ఉండమని చెబుతుంటాడు. అన్నయ్య నాకు ఇచ్చే సలహా అదొక్కొటే.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
కె.వి గుహన్ దర్శకత్వంలో ‘హైవే’ సినిమా చేస్తున్నా. రోడ్ థ్రిల్లర్ చిత్రమిది. సాయిరాజేష్ దర్శకుడిగా తెరకెక్కుతున్న ‘బేబీ’లో నటిస్తున్నా. కొత్త దర్శకుడితో మరోసినిమా చేయబోతున్నా.
ఆధునిక ప్రపంచంలో నెగిటివిటీ పెరిగింది. కొత్తదనాన్ని నమ్మి ‘దొరసాని’ సినిమా చేశా. తొలిపోస్టర్ విడుదలకాగానే నెపోటిజం కోణంలో నన్ను చాలా మంది విమర్శించారు. విమర్శలు మానసికంగా ఒత్తిడికి లోనుచేస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలపై ప్రభావాన్ని చూపుతూ తప్పుడు దారిలో అడుగులు వేసేలా చేస్తాయి. అందుకే విమర్శల్ని చాలెంజింగ్‌గా భావిస్తూ ధైర్యంగా ముందుకు సాగుతున్నా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijaya Devarakonda: తమ్ముడిని విసిగించిన విజయ్.. నా పెళ్లాం లేచిపోయిందన్న ఆనంద్
ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది..పుష్పక విమానం ప్రమోషన్స్‌లో బాంబ్ పేల్చిన విజయ్‌దేవరకొండ..!!
Vijay Deavrakonda: రౌడీ హీరోతో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరు?
Vijay Deverakonda | ఆనంద్ నాకంటే ముందే పెళ్లి చేసుకుంటాడు: విజయ్‌దేవర కొండ
anand devarakonda | ఓటిటిని ఫుల్లుగా వాడేసుకుంటున్న జూనియర్ దేవరకొండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

