ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండడా? సుకుమార్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో తెలుసా

aarya 3 | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అలా సెట్ అయిపోయి ఉంటాయి. ఆ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానులు కూడా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ కూడా అలాంటిదే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తొలి సినిమాతోనే సుకుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య 2 వచ్చింది. ఈ సినిమా కూడా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ.. ఆర్య స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఫ్యాన్స్ ఈ పాటలను వింటూనే ఉంటారు. ఇప్పుడు ఆర్య 3 కూడా రాబోతోంది. అయితే ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండడని తెలుస్తోంది. బన్నీ స్థానంలో సుకుమార్ టాలీవుడ్ క్రేజీ హీరోను తీసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. రష్మిక మంధన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా అభిమానులతో సుకుమార్ చిట్ చాట్ జరిపాడు. అందులో ఒక అభిమాని ఆర్య 3 ఉంటుందా అని అడిగాడు. దీనికి బదులిచ్చిన సుకుమార్ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. దీంతో పుష్ప తర్వాత సుకుమార్ తెరకెక్కించే సినిమా ఆర్య 3నే అని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మరో వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. పుష్ప తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానని అప్పట్లో సుకుమార్ ప్రకటించాడు. దీంతో ఆర్య 3 విజయ్ దేవరకొండ తోనే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ టీ షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే..!
Allu Arjun: బాలయ్య సినిమా కోసం బన్నీ అంతగా ఎదురు చూస్తున్నాడెందుకు..!
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
రాజమౌళిని ఫాలో అవుతున్న సుకుమార్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

