Allu Arjun: బాలయ్య సినిమా కోసం బన్నీ అంతగా ఎదురు చూస్తున్నాడెందుకు..!

బాలయ్య సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడాలి కాని, అల్లు అర్జున్ ఎందుకు ఎదురు చూస్తాడనే డౌట్ అందరిలో కలగడం సహజం. కాని దానికొక కారణం ఉంది. మేటర్లోకి వెళితే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.
అఖండ సినిమా రిలీజైతే… దానికి పాజిటివ్ రిజల్ట్ వస్తే…బన్నీ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తయ్యాక ఐకాన్ చేయాలని అనుకున్నాడు. కాని ఇప్పుడు అఖండ సినిమా రిజల్ట్ చూసి బోయపాటితో చేయాలా లేక వేరే దర్శకుడితో చేయాలా అనే దానిపై ఆలోచనలు చేస్తున్నాడట.
బన్నీ లిస్ట్‌లో వేణు శ్రీరామ్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్,ఏఆర్ మురుగదాస్ తదితర దర్శకులు ఉన్నారని సమాచారం. వారిలో ఏ దర్శకుడితో ఎప్పుడు సినిమా చేస్తాడన్నాది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది.తొలి పార్ట్ క్రిస్మస్కి విడుదల కానుండగా, రెండో పార్ట్ రిలీజ్‌పై సందిగ్ధం నెలకొని ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

