ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Dil raju comments on pawan kalyan and vijay devarakonda | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఐడెంటిటీని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఈయనకు బయటకే కాకుండా ఇండస్ట్రీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌కు వచ్చినంత క్రేజ్ ఎవరికీ రాలేదనే చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి తక్కువ టైంలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరో మాత్రం ఒకరు ఉన్నారు. అతను ఎవరని అనుకుంటున్నారా? అతను ఎవరో కాదు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెబుతున్నాడు.
దిల్ రాజు సహ నిర్మాత అయిన శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ రౌడీ బాయ్స్ సినిమా తెరకెక్కింది. కాలేజి బ్యాక్‌డ్రాప్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా నుంచి ప్రేమే ఆకాశం అనే ఒక డ్యుయెట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ కోసం.. దిల్ రాజు ఏకంగా ఒక ఈవెంట్‌ను పెట్టాడు. దానికి విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను తెగ పొగిడేశాడు దిల్ రాజు. విజయ్‌తో ఉన్న జర్నీ గురించి చెబుతూ.. ‘ కేరింత సినిమా కోసం విజయ్ దేవరకొండ ఆడిషన్స్‌కు వచ్చాడు. అప్పుడు విజయ్ను సరిగ్గా చూడలేదు. అలా చూసి వెళ్లిపోయా. ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చూపులు సినిమాను నాకు చూపించడానికి ట్రై చేశారు. కానీ నేను ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉండటం వల్ల కుదరలేదు. కానీ ఆ తర్వాత జరిగిన గీతా గోవిందం సక్సెస్ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ అరుస్తున్నారు. అప్పుడు నేను విజయ్ దేవరకొండకు ఒకటే చెప్పాను. పవన్ కళ్యాణ్ తర్వాత అతి తక్కువ కాలంలోనే ఇంత స్టార్డమ్ నీకు వచ్చింది అని చెప్పాను అంటూ అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నావ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ టీ షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే..!
Liger: లైగర్ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
దిల్ రాజు ఇన్నాళ్లకు బడ్జెట్ బోర్డర్ దాటేస్తున్నాడుగా.. అన్నీ భారీ సినిమాలే..
పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
Pawan Kalyan | కొత్త సినిమాలకు పవన్‌కల్యాణ్ నో..కారణమిదే !
Vishnu: మా ఇద్దరి మధ్య గొడవలు లేవు అని వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

