Liger: లైగర్ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. పూరి, ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. నవంబర్‌లో ఈ చిత్రం విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు. కాని కరోనా వలన వాయిదా పడింది.
ఈ సినిమాకి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి కారణం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అని పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉందని, దానికోసం యుఎస్‌లో రెండు వారాల సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో దేవరకొండ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్‌తో ఫైట్ చేసే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వీసా ప్రాసెసింగ్‌లో కొంత జాప్యం జరుగుతుందట. వీసా రాగానే, షూటింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ‘లైగర్’ విడుదల తేదీని ప్రకటించనున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

