Kiran Abbavaram | ఆ కుర్రాడిలో విషయం ఉంది.. దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram | బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావడం.. వరుస అవకాశాలు దక్కించుకోవడం ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. అలాంటిది గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.
ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం గత ఏడాది మంచి విజయాన్ని అందుకుంది. కరోనా సమయంలో వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. దానికి ముందు రాజావారు రాణిగారు అనే సినిమా చేశాడు. కానీ ఎస్ ఆర్ కళ్యాణమండపం తర్వాత కిరణ్ టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఆయనే రాసుకున్నాడు. రూ.2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 6 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 4 సినిమాలున్నాయి. సినిమాలపై ఉన్న ఇష్టంతో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
ప్రస్తుతం ‘సెబాస్టియన్’, ‘సమ్మతమే’, ‘ వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇందులో వినరో భాగ్యము విష్ణుకథ గీతా ఆర్ట్స్ 2లో వస్తుంది. ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు కిరణ్. దానికి తోడు సొంతంగా కథలు కూడా రాసుకుంటున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని సబ్జెక్టులు కూడా విన్నాడు కిరణ్ అబ్బవరం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు : కిరణ్ అబ్బవరం
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
Vijay devarakonda | లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఇవే..
అఖిల్ అక్కినేని సినిమాకు అప్పుడే రిపేర్లు మొదలయ్యాయా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

