Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..

Pawan kalyan Hari Hara veeramallu | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అనుకున్న సమయం కంటే కొన్ని ముందు పూర్తవుతున్నాయి. మరికొన్ని ఆలస్యం అవుతున్నాయి. ఎప్పుడో ఏడాదిన్నర కింద సైన్ చేసిన హరిహర వీరమల్లు సినిమా ఇంకా పూర్తి కాలేదు. మరో వైపు దాని తర్వాత కమిట్ అయిన వకీల్ సాబ్ విడుదలై కూడా సంవత్సరం కావస్తోంది. మరోవైపు భీమ్లా నాయక్ సినిమాను కూడా పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్లోనే పూర్తయ్యాయి. దానికితోడు విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేని సినిమాలు ఇవి. అందుకే వాటికి ముందుగా డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. కానీ విఎఫ్ఎక్స్ భారీగా ఉన్న క్రిష్ సినిమా మాత్రం పక్కన పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా సగానికిపైగా బాకీ ఉందని తెలుస్తోంది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. దీనికోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ఏ.ఎం రత్నం. ముందు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని.. సగం షూటింగ్ అయ్యాక అందరికీ క్లారిటీ వచ్చింది.
100 అనుకుంటే 150 కోట్ల వరకు ఈ సినిమా అవుతుందని.. దాంతో నిర్మాతకు అదనపు భారం తప్పడం లేదు అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇన్ని రోజులు ఆగిపోవడానికి కారణం కూడా బడ్జెట్ సమస్యలు అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాకు బడ్జెట్ ఇష్యూ రావడం అనేది కాస్త ఆశ్చర్యంగానే ఉంది.. కానీ ఎంత పెద్ద సినిమా అయినా ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనుకున్న దానికంటే బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో కొన్ని రోజుల షూటింగ్ ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సీక్వెల్లో పవన్ కళ్యాణ్?
భీమ్లా నాయక్ రిలీజ్‌పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

