బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు

‘కష్టపడేతత్వం, ప్రతిభ ఉంటే చిత్రసీమలో బ్యాక్‌గ్రౌండ్‌తో పనిలేదన్నది నా సిద్ధాంతం. చిన్నతనం నుంచి సినిమాలు బాగా చూస్తుండేవాణ్ణి. ఆ అనుభవమే నేను నటుడిగా రాణించడానికి ఉపయోగపడుతోంది’ అని అన్నారు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణిగారు’ చిత్రంలో సహజఅభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారాయన. నేడు కిరణ్ అబ్బవరం జన్మదినం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు
లఘు చిత్రాలతో నా నట ప్రయాణం ఆరంభమైంది. నేను చేసిన షార్ట్ఫిలిమ్స్కు మంచి పేరురావడంతో సినిమాల్లో నటించే అవకాశాలొచ్చాయి. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయగలిగే సత్తా నాకు ఉందా?లేదా?అని స్వీయవిశ్లేషణ చేసుకున్నా. స్టోరీ, ఎడిటింగ్‌తో పాటు సినిమా రూపకల్పనకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన పెంచుకున్న తర్వాతే హీరోగా అరంగేట్రం చేశారు.ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు. హార్డ్‌వర్క్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.
నాలుగు సినిమాల్లో నటిస్తున్నా
ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నా. నేను కథ, స్క్రీన్‌ప్లేను అందించిన ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ ఆగస్టు 6న విడుదలకానుంది. తండ్రీకొడుకులు అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. సమకాలీన రాయలసీమ పరిస్థితులను ప్రతిబింబిస్తూ వినోదాత్మకంగా సాగుతుంది. ‘సెబాస్టియన్’ చిత్రీకరణ పూర్తయింది. ఇందులో రేచీకటితో బాధపడే పోలీస్‌గా కనిపిస్తా. ప్రేమకథతో తెరకెక్కుతున్న ‘సమ్మతమే’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నా. అలాగే దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ కూతురు నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నా. వీటితో పాటు మరో నాలుగు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లలో నటించడానికి నేను ఇష్టపడతా. సమాజంతో పాటు మన చుట్టుపక్కల ఉండే మనుషుల్లోనుంచే కథలు పుట్టాలని నేను నమ్ముతా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

