RRR New release date | ట్రిపుల్ ఆర్ నుంచి సర్ప్రైజ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనంట!!

RRR New release date | తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని చాలారోజులుగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ సినిమాను విడుదల చేద్దామని అనుకున్న ప్రతిసారి కరోనా అడ్డుపడుతూనే ఉంది. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించడంతో అందరూ సంతోషపడ్డారు. కానీ మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కరోనా సినిమా రిలీజ్‌కు కరోనా అడ్డుపడింది. దీంతో ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తూ సినిమా మళ్లీ వాయిదా పడిపోయింది. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని అందరూ అయోమయంలో ఉన్న టైంలో ట్రిపుల్ ఆర్ టీం సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
ఈ ఏడాది సమ్మర్లోనే ట్రిపుల్ ఆర్ సినిమాను రాజమౌళి తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి దేశంలో సాధారణ పరిస్థితులు రావడంతో పాటు థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం మొదలైతే ట్రిపుల్ ఆర్ సినిమాను మార్చి 18న విడుదల చేస్తామని ప్రకటించింది. లేదంటే ఏప్రిల్ 28న ట్రిపుల్ ఆర్ సినిమాను తీసుకొస్తామని ట్రిపుల్ ఆర్ యూనిట్ తెలిపింది.
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. 🔥🌊 pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
మాకు సినిమా వద్దు.. డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. RRR నిర్మాతకు కొత్త తలనొప్పి..
RRR | ట్రిపుల్ ఆర్ సినిమాపై మరో వివాదం.. ఈసారి ఏంటంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

