e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News Katrina kaif | పెళ్లి, విడాకుల‌పై క‌త్రినా కైఫ్ ఒపీనియ‌న్ ఏంటో తెలుసా

Katrina kaif | పెళ్లి, విడాకుల‌పై క‌త్రినా కైఫ్ ఒపీనియ‌న్ ఏంటో తెలుసా


Katrina kaif | బాలీవుడ్‌ భామల్లో క్రతినా కైఫ్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌. ఆమె నవ్వులను వెన్నెలతో పోల్చినా తక్కువే అని చాలా సినిమాల్లో కథానాయకులు తన్మయంగా పాడుకుంటారు. ఆమె ‘మై నేమ్‌ ఈజ్‌ షీలా’ అంటే కుర్రకారు ఉర్రూతలూగారు. ‘చికినీ చమేలి’ అని నెమలిలా నర్తిస్తుంటే మైమరచిపోయారు. కథానాయికగా తనకంటూ ఓ మార్క్‌ సృష్టించుకున్న మన మల్లీశ్వరి అంతరంగం..

Katrina kaif
Katrina kaif

మనసు ప్రశాంతంగా ఉండటాన్ని మించిన సంతోషం మరొకటి లేదు. చేస్తున్న పనిలో ఆనందం ఉంటుంది. పార్టీలకు హాజరైనప్పుడు కూడా ఆనందం దొరుకుతుంది. కానీ, ఆ పొంగు అప్పటికే పరిమితం. మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు వచ్చే సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడే మనం నిజంగా సంతోషంగా ఉన్నట్టు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ క్షణం ప్రశాంతంగా గడపడమే నిజమైన సంతోషం.

- Advertisement -

జయాపజయాలు అన్ని రంగాల్లోనూ సాధారణమే! గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉండటం వల్ల మా గెలుపు ఓటములు వార్తల్లో నిలుస్తుంటాయి. వ్యక్తిగతంగా నేనైతే రెండిటినీ సమానంగా తీసుకుంటాను. ఒకరోజు అటో ఇటో.. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలి. గమ్యాన్ని చేరే వరకు అలుపెరగకుండా ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడు సక్సెస్‌ దానంతట అదే వస్తుందని నమ్ముతాను.
పుస్తకాల కన్నా, జీవితమే ఎన్నో విలువైన పాఠాలు చెబుతుంది. మన సంతోషం కోసం ఇతరులపై ఆధారపడటం సరికాదు. ఎందుకంటే, వాళ్ల ద్వారా మనం కోరుకున్నది లభించకపోవచ్చు. ఇతరుల వల్ల మనకు సంతోషం లభిస్తుందనుకోను. మన సంతోషానికి బాధ్యత మనదే అయి ఉండాలి. అలాగే మన వైఫల్యాలకు ఇతరులపై నింద మోపడం తప్పు. విజయమైనా, పరాజయమైనా అందుకు కర్తలం మనమే అని గుర్తుంచుకోవాలి.

ప్రతి ఒక్కరి జీవితంలో మానసికంగా ఇబ్బందిపడే క్షణాలు ఉంటాయి. ఆ సమయంలో మనకంటూ ఒకరు కావాలనిపిస్తుంది. మనసు ఓదార్పు కోరుకుంటుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, స్వచ్ఛమైన మనసుతో షరతులు లేని ప్రేమను అందించే వ్యక్తి పక్కన ఉంటే, ఎంతటి కష్టమైనా దూది పింజలా తేలిపోతుంది.

వివాహ బంధం మనం అనుకుంటే ఏర్పడేది కాదు, వద్దనుకొంటే తెంచుకునేది కూడా కాదు! భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటాను. ఆలూమగలు విడిపోతే ఆ ప్రభావం కుటుంబంపై, ముఖ్యంగా పిల్లలపై ఎంత ఉంటుందో నాకు అనుభవం. మా అమ్మానాన్నలకు మేం ఎనిమిది మంది సంతానం. నా చిన్నతనంలో అమ్మా నాన్న విడిపోయారు. అమ్మే అంతమందినీ పెంచి పోషించింది. ఏ లోటూ రాకుండా చూసుకుంది. కానీ, ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రేమ ద‌క్కకపోయినా ఆ బాల్యం అసంపూర్ణమే! నా పిల్లలకు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Vicky katrina Wedding | విక్కీకౌశ‌ల్‌-క‌త్రినాకైఫ్‌ నిర్ణ‌యంతో అప్‌సెట్ అవుతున్నారా..?

Vicky Katrina Wedding : విక్కీ, క‌త్రినా పెళ్లి.. వైర‌ల్ అవుతున్న స‌ల్మాన్ ఖాన్ మీమ్స్‌

Katrina Kaif Mehendi worth | క‌త్రినాకైఫ్ మెహందీ ఖ‌ర్చు వింటే షాక‌వ్వాల్సిందే..!

Vicky and Katrina honeymoon | వెడ్డింగ్ త‌ర్వాత నో హ‌నీమూన్ అట‌..!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement