Vicky katrina Wedding | విక్కీకౌశల్-కత్రినాకైఫ్ నిర్ణయంతో అప్సెట్ అవుతున్నారా..?
బాలీవుడ్ (Bollywood) స్టార్ సెలబ్రిటీలు విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా కైఫ్ (katrinakaif)పెళ్లికి గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా కత్రినాకైఫ్ పెళ్లి ఈవెంట్‌కు వెళ్లొచ్చని అనుకున్న చాలా మంది అభిమానులకు ఓ నిర్ణయం అప్ సెట్ అయ్యేలా చేస్తోందన్న వార్త ఇపుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ సెలబ్రిటీలు విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా కైఫ్ (katrinakaif)పెళ్లికి గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్ సవాయి మదోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ (Six Senses Hotels Fort Barwara) బర్వారాలో వెడ్డింగ్ జరుగనుంది. డెకో ఈవెంట్స్ ఈ సెర్మనీ ఏర్పాట్లను చూస్తోంది..కాగా కత్రినాకైఫ్ పెళ్లి (Vicky katrina Wedding)ఈవెంట్‌కు వెళ్లొచ్చని అనుకున్న చాలా మంది అభిమానులకు ఓ నిర్ణయం అప్ సెట్ అయ్యేలా చేస్తోందన్న వార్త ఇపుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ విషయమేంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది.
వెడ్డింగ్ వేడుకకు కొద్ది మంది రావడానికి మాత్రమే అవకాశం ఇవ్వడంతోపాటు కొన్ని రూల్స్ కూడా పెట్టడంతో పలువురు నిరాశకు లోనవుతున్నారట. కల్యాణ వేదికకు నిర్దేశించిన పాయింట్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. అంతేకాదు వేదికపై ఉన్న కత్రినా, విక్కీ కౌశల్‌ను ఫొటోలు కానీ, వీడియోలు తీయడం కానీ వీలు లేదని పెళ్లికి ఆహ్వానం అందిన ఓ అతిథి చెప్పుకొచ్చినట్టు కథనం. అంతేకాదు ఎవరైనా ఫొటోలు కానీ, వీడియోలు కానీ తీస్తే ముందస్తు అనుమతి లేకుండా వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం కుదరదని నిబంధనల్లో పెట్టారట. వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్న అభిమానులకు కత్రినా-విక్కీ కౌశల్ పెట్టిన రూల్స్ మింగుడుపడటం లేదట.
హోటల్లోని రాజా మాన్ సింగ్ సూట్‌ను కత్రినా-విక్కీ కపుల్ కోసం బుక్ చేసినట్టు టాక్. డిసెంబర్ 6న ఈ కపుల్ హోటల్‌కు రానున్నది. డిసెంబర్ 7న సంగీత్ సెర్మనీ, 8న మెహిందీ వేడుక, 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి వేడుక జరగనున్నది. 10వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

