Scarf Scrunchies | పోనీటెయిల్ రోజూ ఒకేలా వేసుకుని బోర్ కొడుతున్నదా? అయితే ఈసారి డ్రెస్‌కి మ్యాచ్ అయ్యే ‘స్కార్ఫ్ స్క్రంచీ’ వేసేయండి. స్కార్ఫ్‌లను తలపించే రబ్బరు బ్యాండ్లనే ‘స్కార్ఫ్ స్క్రంచీ ( Scarf Scrunchies )’లు అంటారు.
వీటిలో ఎన్నో వర్ణాలు, అంతకుమించిన డిజైన్లూ ఉన్నాయి. సిల్క్, షిఫాన్, వెల్వెట్, శాటిన్లాంటి రకరకాల వస్త్రాలతోనూ వస్తున్నాయి. పొడవాటివి, పొట్టివి, అటూ ఇటూ రెక్కల్లా వచ్చేవి కూడా దొరుకుతున్నాయి. జీన్స్, చుడీదార్, టాప్ మీదికి కూడా బాగుంటాయి. కాలేజీ, ఆఫీస్, ఫంక్షన్.. సందర్భం ఏదైనా నలుగురిలో ట్రెండీగా కనిపించడానికి వీటిని ఎంచుకోవచ్చు. అమెజాన్, మింత్రాలాంటి వెబ్సైట్లలోనూ దొరుకుతున్నాయి.
Ice Cream Fashion | ఐస్‌క్రీమ్ తినేందుకే కాదు.. ఈ వేసవికిదే హాటెస్ట్ కూల్ ట్రెండ్ !!”
Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..”
“Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”