Langa Voni Fashion | పెండ్లిళ్ల సీజన్లో సంప్రదాయ లంగా ఓణీలదే హవా !!
Langa Voni Fashion | వివాహాల సీజన్ వచ్చిందంటే చాలు అమ్మాయిల హంగామా మామూలుగా ఉండదు. పట్టుచీరలు, లంగా ఓణీలు, గాగ్రాచోళీలు అంటూ సంప్రదాయ దుస్తుల వేటలో పడిపోతారు. ప్రస్తుతం లంగా ఓణీల ట్రెండ్ నడుస్తున్నది. పట్టు లంగాలకు మగ్గం వర్క్ జతచేసి మరింత ముచ్చటగా రూపొందిస్తున్నారు.
నిండైన అంచుతో..
లేత నీలిరంగు కంచిపట్టు ఫ్యాబ్రిక్‌తో ప్రాణంపోసిన డిజైన్ ఇది. చిన్నచిన్న చెక్స్‌తో, మధ్యమధ్యలో బుటీస్ వర్క్ ముచ్చటగా ఉంది. బార్డర్ హైలైట్ అయ్యింది. లెహంగాకు నప్పేలా అదే రంగు సిల్క్ ఫ్యాబ్రిక్‌తో టాప్ డిజైన్ చేశారు. లో యోక్ నెక్ ఇచ్చి షోల్డర్ పార్ట్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ త్రెడ్ వర్క్ చేశారు. స్కై బ్లూ, పింక్ కాంబినేషన్‌ను హైలైట్ చేస్తూ.. ఇంట్రికేట్ మగ్గం కట్ వర్క్ చేశారు. ఈ కాంబినేషన్‌కు నప్పేలా పింక్ నెట్ ఫ్యాబ్రిక్‌పై గోల్డ్ కలర్ కట్‌వర్క్ బార్డర్ జోడించిన దుపట్టా అదనపు ఆకర్షణ.
అదిరే ఆభరణాలతో..
ఆరెంజ్ కలర్ కంచిపట్టు ఫ్యాబ్రిక్‌తో చేసిన డిజైన్ ఇది. నిండైన నారింజ రంగుకు నప్పేలా బంగారు వన్నెతో బార్డర్‌ను జతచేశారు. బంగారు జరీపై వీవింగ్‌తో ఇచ్చిన బుటీస్ లెహంగా అంతా పరుచుకుని అందంగా కనిపిస్తాయి. దీనికి కాంబినేషన్‌గా.. హ్యాండ్స్ కోసం జరీ ఫ్యాబ్రిక్‌తో ఆభరణాలను పోలిన డిజైన్ రూపొందించారు. బోట్ నెక్ ఇచ్చి.. హారాన్ని తలపించేలా ఆరెంజ్, బ్లూ కలర్ స్టోన్స్, పచ్చల డ్రాప్స్, కుందన్లతో చేసిన డిజైన్ హైలైట్ అయింది. లెహంగా కలర్లోనే ఆర్గంజా ఫ్యాబ్రిక్‌పై బ్లూ కలర్ బార్డర్ జతచేసిన దుపట్టా బావుంది. చేతులకు వంకీల్లా చేసిన డిజైన్ అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
Long Frocks | పెండ్లిల్ల సీజన్లో ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్”
ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!”
సన్నని నడుముకు వన్నెల గొలుసు.. మళ్లీ ట్రెండింగ్ అవుతున్న ఓల్డ్ స్టైల్”
“ఎండాకాలంలో పిల్లలకు హాయినిచ్చే ఈ దుస్తులను ట్రై చేయండి”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- half saree
- Langa voni
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

