ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!
Bridal Makeup | వేసవిలో పెండ్లిల్లకు కొదవే ఉండదు. మండుటెండ, ఉక్కపోత లెక్క చేయకుండా పెండ్లి పనుల్లో మునిగిపోతారంతా. పెద్దల సంగతి సరే! వధువు కష్టాన్నీ అర్థం చేసుకోవాలి. అందంగా మేకప్ వేసుకుందామని అనుకుంటే.. అనేక అవరోధాలు. ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు సౌందర్య నిపుణులు.
నాణ్యమైన టోనర్
పెండ్లి సమయంలో ధర ఎక్కువైనా నాణ్యమైన టోనర్ ఎంచుకోవాలి. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు టోనర్ మంచి మెరుపును ఇస్తుంది. రోజ్‌వాటర్, కీరదోస కలగలిసిన టోనర్ ఉత్తమం. అది ‘ఆల్కహాల్ ఫ్రీ’ అయితే మరీ మంచిది. మాయిశ్చరైజర్ కూడా జిడ్డును పెంచేలా ఉండొద్దు.
వాటర్ బేస్డ్ ప్రైమర్
మేకప్‌లో భాగంగా వేసుకునే ప్రైమర్ యాంటీ షైన్, వాటర్ బేస్డ్ అయితే ఉత్తమం. ప్రైమర్ వాడితే చెమట మేకప్‌ని చెడగొట్టకుండా ఉంటుంది.

కోల్డ్ థెరపీ
చర్మంపై చెమటను త్వరగా, సులువుగా తొలగించాలంటే చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలాగే ఒక కాటన్ గుడ్డలో ఐస్ ముక్కలు వేసి చుట్టాలి. దాంతో ముఖాన్ని రుద్దుకోవాలి. చల్లటి నీళ్లు, ఐస్ ముక్కలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
ఫినిషింగ్ స్ప్రే
వాటర్ బేస్డ్ మ్యాట్ మేకప్ వేసుకున్నాక, చివరగా నాణ్యమైన మేకప్ ఫినిషింగ్ స్ప్రే చేయాలి. దీనివల్ల కొన్ని గంటలవరకు చెమట బాధ లేకుండా ముఖం నిగనిగలాడుతుంది.
Read More :
ఎలా పడితే అలా స్నానం చేయొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే”
Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి”
“అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి”
“Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి”
“ముఖం అందంగా ఉంటే సరిపోతుందా.. పాదాలూ అందంగా ఉండాలిగా..!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- fashion
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

