Bathing | స్నానం చేశాక అలసట దూరమై ప్రశాంతంగా అనిపిస్తుంది. స్నానంలో భాగంగా మొహం కడుక్కునేటప్పుడు గోరువెచ్చని నీళ్లను ఉపయోగించాలి. అవి చర్మ రంధ్రాలను తెరుస్తాయి. దీనివల్ల మనం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు మొటిమలు రాకుండా, చర్మాన్ని నిగారించేలా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అవి ఆ రంధ్రాలను మూస్తాయి. లేదంటే బ్యాక్టీరియా చర్మంలోకి చేరే అవకాశం ఉంటుంది. అలాగే స్నానం తర్వాత శరీరం మొత్తానికీ మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవాలి.
మరీ వేడి నీళ్లతో స్నానం చేస్తే, సహజమైన నూనెలు దూరమై చర్మం పొడిబారుతుంది. షాంపూ పెట్టుకోవడమూ ఓ కళే. మాడుపై షాంపూ వేసి రుద్దకుండా, జుట్టును మాత్రమే షాంపూతో మర్దన చేయాలి. అర నిమిషం తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. చివరగా కండిషనర్ పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత కడుక్కోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెన వాడొద్దు. తలస్నానానికి ముందే చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. బాడీ స్క్రబ్స్‌లో కూడా సువాసన వెదజల్లేవి తీసుకుంటే, స్నానం చేస్తున్నంతసేపు హాయిగా ఉంటుంది.
“డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”
“Weight Loss | ఈ రెండింటిని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు”
“కాటేస్తున్న కాలుష్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే !!”
“Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి”