Long Frocks | పెండ్లిల్ల సీజన్లో ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్
Long Frocks | పెండ్లిల్ల సీజన్ వచ్చిందంటే చాలు.. సంప్రదాయ దుస్తులపైనే దృష్టి పెడతారు మహిళలు. సంప్రదాయ కాంబినేషన్లోనే ట్రెండీ లుక్స్‌లో అదరగొట్టే లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ కలెక్షన్లేమిటో చూద్దాం.
పటోలా పట్టుతో
టమాట రంగు పటోలా పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. యోక్ పార్ట్‌లో నెక్లైన్ నుంచి వెయిస్ట్ లైన్ వరకు.. మధ్యలో బ్లూ కలర్ ఫ్యాబ్రిక్‌తో పొట్లీ బటన్స్ ఇచ్చారు. ఫ్రాక్ కలర్‌కి నప్పేలా నీలిరంగు మేళవింపుతో ఐదించుల బార్డర్ హైలైట్ అయ్యింది. బార్డర్, యోక్ పార్ట్ కాంబినేషన్‌కు సరిపోయేలా హ్యాండ్స్ కూడా రెడ్ అండ్ బ్లూ చెక్స్‌తో డిజైన్ చేశారు. బాటమ్ గేరా ఇచ్చిన చిన్నచిన్న ప్లీట్స్ గౌనుకు మరింత అందాన్ని తెచ్చాయి. బ్లూ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ దుపట్టా చక్కగా నప్పింది.
పసుపు మేళవింపుతో
పసుపు రంగును శుభానికి సూచనగా భావిస్తారు. అందుకే శుభకార్యాల్లో ఆ వర్ణానికే పెద్దపీట. పసుపు-ఎరుపు కాంబినేషన్లో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. మస్టర్డ్ ఎల్లో ఆర్గంజా ఫ్యాబ్రిక్‌పై పక్షుల అల్లిక ఉన్న ఫ్యాబ్రిక్‌ను జత చేశారు. యోక్ పార్ట్‌లో ఎల్లో కలర్ ఇచ్చి మిడిల్లో రెడ్ కలర్‌తో పొట్లీ బటన్స్ జోడించారు. రెడ్ కలర్ జరీ ఫ్యాబ్రిక్‌తో హ్యాండ్స్ ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్‌ను బార్డర్‌గా ఇచ్చారు. బాటమ్‌కి కూడా ఎల్లో ఫ్యాబ్రిక్‌ను క్రాస్ కట్లో ఇచ్చి, దానికి రెడ్ జరీ బార్డర్ జత చేశారు. షిఫాన్కు బంగారు వన్నె బార్డర్ జత చేసిన దుపట్టా బాగా నప్పింది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!
ఎండాకాలంలో పిల్లలకు హాయినిచ్చే ఈ దుస్తులను ట్రై చేయండి
Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
“ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

