Ice Cream Fashion | ఐస్‌క్రీమ్ తినేందుకే కాదు.. ఈ వేసవికిదే హాటెస్ట్ కూల్ ట్రెండ్ !!
Ice Cream Fashion | హాట్‌హాట్ సమ్మర్లో కూల్ కూల్ ఐస్‌క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో! నాలుక మీద ఐస్‌క్రీమ్ చల్లగా తగలగానే ఎండవేడంతా చటుక్కున మాయమైపోయినట్టు అనిపిస్తుంది. మనకే కాదు, ఫ్యాషన్ డిజైనర్లకూ ఐస్‌క్రీమ్స్ తెగ నచ్చేస్తున్నాయి. అందుకే, ఈ మంచు మిఠాయిలతో ‘ఐస్‌క్రీమ్ ఫ్యాషన్’ తీసుకొస్తున్నారు. ఈ వేసవికిదే హాటెస్ట్ కూల్ ట్రెండ్!

కొత్త బట్టలు కొన్నామంటే.. మన దగ్గర ఉన్నవాటిలో లేని ప్రత్యేకత ఏదో వాటిలో ఉండి తీరాలి. చెవికి దుద్దులు పెడితే ఎవరి చూపైనా ఒక్కసారి వాటిమీద పడాల్సిందే. ఇక బూట్లూ, పర్సులయితే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా కనిపించాల్సిందే. ఇవన్నీ జతపడాలంటే ఏదో ఒక కొత్త ఫ్యాషన్ ట్రై చేయక తప్పదు. ఇలాంటి విభిన్న అభిరుచులున్న యువత కోసమే సమ్మర్ ట్రెండ్‌గా ‘ఐస్‌క్రీమ్ ఫ్యాషన్’ తెరమీదికి వచ్చింది.

మనం వాడే బట్టలూ యాక్సెసరీలలో ఐస్‌క్రీమ్ డిజైన్లను చొప్పిస్తూ ఈ తరహా ఫ్యాషన్‌ను సృష్టిస్తున్నారు డిజైనర్లు. టాపులూ, స్కర్టులూ మొదలు బ్యాగులూ, కళ్లద్దాల దాకా ఒకటనేమిటి అన్నిటిమీదా ఈ రకం ఐస్‌క్రీమ్ బొమ్మలు తళుక్కుమంటున్నాయి. చెవి దుద్దులూ, గొలుసులూ, ఉంగరాల్లోనూ ఐస్‌క్రీమ్ ట్రెండ్ కొనసాగుతున్నది. కరోనా సమయానికి తగ్గట్టు మాస్కుల మీదా వీటి ముద్రలు కనిపిస్తున్నాయి.

పాల ఐస్, ఆరెంజ్ ఐస్, స్ట్రాబెర్రీ, మ్యాంగో ఐస్‌లాంటి వాటితోపాటు కేసర్ పిస్తా, బ్లాక్ కరెంట్, డార్క్ చాకొలెట్ … ఇలా ఐస్ఫ్రూట్లూ, ఐస్‌క్రీముల్లో మనకు తెలిసినవే ఎన్నో ఫ్లేవర్లు ఉంటాయి. రకరకాల రంగుల్లో, విభిన్నమైన ఆకృతుల్లో చూడగానే ఆకట్టుకుంటాయి. వాటి వర్ణాలనూ, ఊరించే ఆకృతులనూ రంగరించి తయారు చేస్తున్నదే ఈ ఐస్‌క్రీమ్ ఫ్యాషన్. ఈ మోడల్లో తయారయ్యే లోలాకులూ, లాకెట్లలాంటి జువెలరీ అయితే సువాసనలు వెదజల్లేలానూ వస్తున్నాయి.

ఒక్క అమ్మాయిలకే కాకుండా అబ్బాయిల కోసం తయారుచేసే టీ షర్టులూ, బూట్లూ, వాచీల్లాంటి వాటిలోనూ ఈ కూల్ఫ్యాషన్ మెరుస్తున్నది. ఇష్టమైన బొమ్మలు ఉండటంతోపాటు చూసేందుకు ట్రెండీగానూ కనిపిస్తుండటంతో యువతకు ఇవి ఫేవరెట్లుగా మారుతున్నాయి. హాట్‌హాట్ సమ్మర్లో వచ్చిన ఈ ఫ్యాషన్‌ను చూసిన వాళ్లెవరైనా… కూల్… అనాల్సిందే!

Read More :
Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..”
“Gollabhama Sarees | సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే తయారయ్యే ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే..”
“Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”
“firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

