సంప్రదాయానికి ఆధునికత జోడించిన ఈ కలెక్షన్స్ ఎప్పటికీ ట్రెండీనే !!
Traditional Dresses | ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు వారం వారం బోనాలతో ఊరూవాడా హోరెత్తుతాయి. మిగతారోజుల్లో ఎలా ఉన్నా పండుగలకు మాత్రం సంప్రదాయ దుస్తుల్లో తయారైపోతారు మగువలు. సంప్రదాయంతోపాటు కాస్త ఆధునికతను జోడించిన కలెక్షన్ ఈవారం మీకోసం..
లంగావోణీ..
మహిళల దుస్తుల్లో ఆరెంజ్ అండ్ వైట్ ఎవర్గ్రీన్ కాంబినేషన్. నారింజ, తెలుపు రంగు ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లంగావోణి ఇది. శాటిన్, కాటన్ ఫ్యాబ్రిక్‌తోపాటు కెన్కెన్ను జతచేసి బాటమ్‌కు బౌన్సీలుక్ వచ్చేలా డిజైన్ చేశారు. క్రీమ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో రూపొందించిన లెహంగాకు బార్డర్లో ఆరెంజ్ టచ్ ఇచ్చి హైలైట్ అయ్యేందుకు వైట్ థ్రెడ్ వర్క్ చేశారు. బార్డర్ కాంబినేషన్లో ఇచ్చిన ఆరెంజ్ కలర్ జాకెట్‌కు ఆల్ఓవర్ మగ్గంవర్క్తో హెవీలుక్ వచ్చింది. రెండిటికీ నప్పేలా ఆరెంజ్ నెట్టెడ్ దుప్పట్టా ఇచ్చి వైట్ థ్రెడ్ వర్క్ బార్డర్‌ను జతచేశారు. సేమ్ కలర్లో ఇచ్చిన సైడ్ డోరీలు అదనపు ఆకర్షణ.
కాస్త ట్రెండీగా..
నలుగురిలోనూ తళుక్కున మెరిసేలా శాటిన్ జాల్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డ్రెస్ ఇది. లేత గులాబీ రంగు నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌ని సిల్వర్ కలర్ చమ్కీవర్క్తో హైలైట్ చేశారు. టాప్ అండ్ బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించి మధ్యలో ప్రిల్స్తో జతచేశారు. డీప్ ‘వీ’నెక్తోపాటు హాఫ్ హ్యాండ్స్ ఇవ్వడంతో ట్రెండీలుక్ వచ్చింది. లైనింగ్‌గా కెన్కెన్ వాడటం వల్ల బౌన్సీలుక్ వచ్చింది. వేవ్లుక్ కోసం బార్డర్ పైపింగ్ ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్‌తో దుపట్టాని ఇచ్చి దాన్ని ప్రత్యేకంగా వేసుకునే పనిలేకుండా రెండువైపులా డ్రెస్కే జతచేశారు. పొడవాటి దుపట్టాతో రాయల్ లుక్ వచ్చింది.
– డి.విద్య, ఫ్యాషన్ డిజైనర్, వన్‌స్టెప్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్, సిద్దిపేట.
Read More :
“Fashion Sarees | మగువల మనసు దోచేస్తున్న ట్రెండీ కలెక్షన్స్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- Model
- Traditional
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

